గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'గ్రీన్ జాబ్' కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌పై మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయినవారికి ఆపై ఉపాధి అవకాశం కూడా కల్పించనున్నారు. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మేనేజర్ రాఘవేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.


ఉచిత శిక్షణపై ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు ఐటీఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు మార్చి 15 లోపు తమ పేర్లను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధింత ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. 


వివరాలు...


* ఉచిత శిక్షణ


అంశం: సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌.


అర్హత: ఐటీఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.


వయోపరిమితి: వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో. ఫోన్ నెంబరు ద్వారా సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 


సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 99641 31921, 80190 50334.


Also Read:


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


TSSPDCL: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న 48 అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి జనవరి 17న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిభ్రవరి 23న ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...