AP DSC 2025 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌లో ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు జూన్‌ ఆరు నుంచి ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను ఇవాళ ప్రభుత్వం cse.ap.gov.in వెబ్‌సైట్‌లో పెట్టింది. సాయంత్రం వరకు వివిధ సాంకేతిక కారణాలతో కొందరు అభ్యర్థులకు హాల్‌టికెట్లు రాలేదు. అసలు మీరు ఎలాంటి పోస్టుకు అర్హులో మీరు ఎంచుకోలేదనే ఎర్రర్ చూపించింది. దీన్ని చూసిన అభ్యర్థులు కంగారు పడ్డారు. విషయం అధికారులకు తెలిసి గ్లిచ్‌ను సరి చేశారు. దీంతో ఇప్పుడు అందరికీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ అవుతున్నాయి. 

హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేయడం కంటే వాట్సాప్‌ద్వారానే తీసుకోవడం చాలా ఉత్తమం, వెబ్‌సైట్‌ ద్వారా మీరు ఏపీ డీఎస్సీ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా మీరు ఐడీ ముందుగా క్యాండిడేట్‌ లాగిన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీరు యూజర్ ఐడీ ఎంటర్ చేయాలి. దీన్ని మీరు అప్లికేషన్ నింపిన తర్వాత మీకు ఇచ్చి ఉంటారు. MDSCతో కలిపి 11 డిజిటిట్స్‌తో ఉంటుంది ఇది. దీన్ని మీరు ఎంటర్ చేయాలి. 

యూజర్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత పాస్ వర్డ్ కూడా ఎంట్ చేయాలి. దాని కింద ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను కూడా ఎంట చేసిన తర్వాత మీరు మీ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకే హాల్‌టికెట్‌తో మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసి ఉంటే అన్ని రాసుకోవచ్చు. 

హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ వాట్సాప్ ద్వారా సులభం ఏపీ డీఎస్సీ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ వాట్సాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ముందుగా 95523 00009 నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్‌ సెండ్ చేయండి. తర్వాత మీకు రిప్లై వస్తుంది. అందులో సేవలు ఎంచుకోండి అని ఉంటుంది. అందులో విద్యాశాఖను ఎంచుకోండి. అక్కడ హాల్‌టికెట్లు అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏపీ డీఎస్సీ 2025 అని వస్తుంది. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

అలా క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. అందులో టైప్ చేయాల్సి ఉంటుంది. అలా టైప్ చేసిన తర్వాత దాని కిందే మీ పుట్టిన తేదీ, సంవత్సరం అడుగుతుంది. దాన్ని టైప్ చేయాలి. ఈ రెండు ఇచ్చిన తర్వాత సబ్‌మిట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత కాసేపటికి మీ హాల్‌టికెట్ మీ వాట్సాప్‌కు సెండ్ చేస్తారు. దీన్ని ప్రింట్‌ అవుట్ తీసుకొని పరీక్షకు హాజరుకావచ్చు.