Alps mountains collapsing Switzerland: గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ప్రపంచంపై చాలా ఎక్కువగా ఉంటోంది. ఆ ప్రభావం మంచు పర్వతాలు ఉన్న దేశాలపై ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా స్విట్జర్లాండ్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆల్ఫ్స్ పర్వతాలపై మంచులు కుప్పకూలిపోతున్నాయి.
ఆల్ప్స్ పర్వతాల్లో లోట్స్‌చెంటల్ లోయలో ఉన్న బ్లాటెన్ గ్రామం పైన ఉన్న బిర్క్ గ్లేసియర్‌లో భారీ భాగం మూడు రోజుల కిందట కూలిపోయింది. దీని వల్ల సుమారు 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల మంచు, రాళ్లు, మట్టి, నీరు దిగువన ఉన్న గ్రామాలపై పడినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది భూకంప తీవ్రతగా కూడా నమోదు అయింది.
కొన్ని గ్రామాలు మంచులో కూరుకుపోవడంతో పాటు .. అక్కడ ప్రవహించే నదికి కూడా అడ్డం పడిపోయాయి. ప్రాణ నష్టం మాత్రం పెద్దగా జరగలేదు. ఇలా జరిగే ప్రమాదం ఉందని ముందుగానే నిపుణులు హెచ్చరించారు. గ్లేసియర్‌లో అస్థిరత గుర్తించిన శాస్త్రవేత్తలు గ్రామంలోని 300 మంది నివాసితులను ఖాళీ చేయమని ఆదేశించారు. ఆ గ్రామ ప్రజలంతా వెళ్లిపోయారు కూడా. దీంతో ప్రాణ నష్టం తప్పింది.
మంచు కుప్పకూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బిర్క్ గ్లేసియర్ గత దశాబ్దంలో కరిగిపోతూ వస్తున్నాయి. అలాగే రాళ్ల ఒత్తిడి వల్ల ముందుకు సాగుతూ వస్తోంది. ఈ రాళ్లు పర్మాఫ్రాస్ట్ కరగడం వల్ల విరిగిపడ్డాయ. స్విట్జర్లాండ్ గ్లేసియర్లు 2022-2023 మధ్య 10 శాతం మంచును కోల్పోయాయి. ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావ తీవ్రతను చూపిస్తోంది. గత 10-15 సంవత్సరాలలో ఆల్ప్స్‌లోని పర్మాఫ్రాస్ట్ ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్‌కు పైగా పెరిగింది, దీనివల్ల రాక్‌ఫాల్స్, గ్లేసియర్ అస్థిరత పెరిగింది. స్విట్జర్లాండ్ గ్లేసియర్లు 2023లో 4 శాతం మంచును కోల్పోయాయి. 2022లో 6 శాతం కోల్పోయాయి, ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని సూచిస్తుంది.