తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ప్యాకల్టీల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని 23 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అయితే వీరికి రెగ్యులర్‌ ఉద్యోగులకన్నా ఎక్కువ జీతాలు ఇవ్వనుండటం విశేషం. కేవలం ఏడాది కాలానికి మాత్రమే ఈ నియామకాలను భర్తీ చేయనున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పెంచుతారు. రెగ్యులర్‌ నియామకాలు చేపడితే మాత్రమే వీరు ఉద్యోగాల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలు ఉండగా.. వాటిలో గాంధీ, ఉస్మానియా, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలను మినహాయించి మిగిలిన 23 కాలేజీల్లో పోస్టులు భర్తీ కానున్నాయి. 


పోస్టుల వివరాలు...


1) ప్రొఫెసర్‌


2) అసోసియేట్ ప్రొఫెసర్‌


3) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌.


ఖాళీల భర్తీచేసే కళాశాలలు: జీఎంసీ వనపర్తి, జీఎంసీ నాగర్‌కర్నూల్‌, జీఎంసీ మహబూబాబాద్‌, జీఎంసీ భద్రాద్రి కొత్తగూడెం, జీఎంసీ జగిత్యాల, జీఎంసీ సంగారెడ్డి, జీఎంసీ మంచిర్యాల, జీఎంసీ రామగుండం, జీఎంసీ కామారెడ్డి, జీఎంసీ వికారాబాద్‌, జీఎంసీ జనగామ, జీఎంసీ కరీంనగర్‌, జీఎంసీ ఆసిఫాబాద్‌, జీఎంసీ జయశంకర్‌ భూపాలపల్లి, జీఎంసీ నిర్మల్‌, జీఎంసీ ఖమ్మం, జీఎంసీ సిరిసిల్ల, రిమ్స్ ఆదిలాబాద్‌, జీఎంసీ నిజామాబాద్‌, జీఎంసీ మహబూబ్‌నగర్‌, జీఎంసీ సిద్దిపేట, జీఎంసీ నల్గొండ, జీఎంసీ సూర్యాపేట.


అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధనానుభవం ఉండాలి.


వయోపరిమితి: 69 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి మెయిల్‌ ద్వారా పంపాలి.  


ఎంపిక విధానం: పీజీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.


జీతం: ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1.25 లక్షలు చెల్లిస్తారు. అయితే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు అదనంగా మరో రూ.50 వేలు ఇస్తారు. ఎంపికైన వారు విధిగా బాండ్‌ పేపర్‌ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఉద్యోగాన్ని వదిలేస్తే మూడు నెలల జీతాన్ని జరిమానాగా చెల్లించాలి. జాయినింగ్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాలల్సి ఉంటుంది.


ముఖ్య తేదీలు..


దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 05.08.2023. 


కౌన్సెలింగ్‌ నిర్వహణ: 09.08.2023.  


ఎంపికైన అభ్యర్థుల జాయినింగ్‌ రిపోర్టు: 24.08.2023. 


Notification & Application 


Website


ఈ-మెయిల్: dmerecruitment.contract@gmail.com


ALSO READ:


కేంద్ర కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ పోస్టుల భ‌ర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పోస్టుల‌వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బ‌ట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..