జనగామలోని జిల్లా హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్(డీహెచ్ఈడబ్ల్యూ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 29 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 04
1. జిల్లా మిషన్ కోఆర్డినేటర్: 01 పోస్టు
2. జెండర్ స్పెషలిస్ట్: 01 పోస్టు
3. ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్: 01 పోస్టు
4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల ప్రకారం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: District Welfare Officer, Women, Child, Disabled and Elderly Welfare Department, Jangaon District Integrated District Office Complex, Room No. G-6, Jangaon District-506167.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంసిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.04,2023.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 29.04.2023.
Also Read:
ఆంధ్రప్రదేశ్‌లో ‘మనబడి నాడు–నేడు’ పథకంలో భాగంగా వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం 2020–21 నుంచి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆయా పాఠశాలల్లో దశల వారీగా టాయిలెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ, కిచెన్ షెడ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..