Chandrababu Tour :    ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు రోడ్ షో ను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో ఆయన అనుచర గణం వచ్చింది.  వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్ మీదకు వచ్చారు. నల్ల బెలూన్లు, టీ షర్టులు ధరించి.. బాబు గో బ్యాక్ ప్లకార్డులతో నిరసన  చేపట్టారు. స్వయంగా సురేష్ కూడా రోడ్డు మీదకు వచ్చారు. ఆయన చొక్కా తీసేసి నిరసన చేపట్టారు. చంద్రబాబు దళితుల్ని అవమానపర్చారని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 


అదనపు భద్రత ఏర్పాటు చేసిన చంద్రబాబు సెక్యూరిటీ చూసే ఎన్‌ఎస్జీ                     


చంద్రబాబు పర్యటనల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూండటంతో ఆయన సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న ఎన్‌ఎస్‌జీ ఎప్పటికప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకుంటోంది. యర్రగొండ పాలెంలో కూడా అదనపు సిబ్బందితో చంద్రబాబు కు  భద్రతా ఏర్పాట్లు చేశారు.   నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత పెంచినట్టు తెలుస్తోంది. 


వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు                                      


చంద్రబాబు పర్యటనను ఉద్దేశపూర్వకంగా మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి కూడా పోలీసులు కంట్రోల్ చేయలేదని టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు.  చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని ఫైర్ అయ్యారు. దళితులను అవమానించిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హతే లేదన్నారు.


చొక్కా విప్పి హల్ చల్ చేసిన మంత్రి సురేష్                                                      


అయితే టీడీపీ కార్యకర్తలు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆఫీసు వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాల పోటాపోటీ నిరసనల నేపథ్యంలో యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి.   దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ అవహేళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు దళితుల ఓట్లు కావాల్సి వచ్చాయని.. అందుకోసమే దళితులపై ప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సురేష్ ఆరోపించారు. దళిత ప్రజలనే కాదు.. సొంత పార్టీ దళిత నాయకులను కూడా హేళన చేస్తూ చంద్రబాబు అవమానిస్తుంటారని మంత్రి విమర్శించారు. ఇటీవల యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్డ్ ఎరిక్షన్ బాబును కూడా చంద్రబాబు ఘోరంగా అవమానించారని మంత్రి సురేష్ అన్నారు. 


వెలుగులోకి వివేకా రెండో భార్య సీబీఐ స్టేట్‌మెంట్ - సంచలనాలు ఎన్ని ఉన్నాయంటే ?