తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి సెప్టెంబరు 15న 'టెట్' పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబరు 9న విడుదల చేశారు. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 14 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ దరఖాస్తు ఐడీ, పుట్టినతేదీ వివరాలతో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే హెల్ప్‌ డెస్క్‌ 040-23120340, 040-23120433 నంబర్లను సంప్రదించవచ్చు. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 27న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు.


టెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష షెడ్యూలు..



పేపర్-1 పరీక్ష విధానం: 
పేపర్-1లో 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్ నుంచి 30 పశ్నలు ఉంటాయి. వీటిలో సెక్షన్-1 ఛైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజి-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-2 లాంగ్వేజ్-1-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-3 లాంగ్వేజ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-4 మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-5 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).



పేపర్-2 పరీక్ష విధానం: 
పేపర్-2లో 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. మూడు సెక్షన్ల నుంచి 30 పశ్నల చొప్పున 90 ప్రశ్నలు, ఒక సెక్షన్ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో సెక్షన్-1 ఛైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజి-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-2 లాంగ్వేజ్-1-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-3 లాంగ్వేజ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-4 మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).



అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40% గా నిర్ణయించారు.


తెలంగాణ టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
పాఠశాల విద్యాశాఖ ఇటీవలే 5089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 5,089 ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్‌ అసిస్టెంట్‌ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358, నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది. 


డీఎస్సీ నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..