తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆగస్టు 16 వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో 'టెట్' పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.  


టెట్-2023కు సంబంధించి పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అర్హత ఉన్నవారు రాయడానికి అర్హులు. అదేవిధంగా బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివుతున్నవారు కూడా టెట్ రాయడానికి అర్హులే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు జరుగనున్నాయి. సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. 


వివరాలు..


* తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌ టెట్) - 2023


అర్హత: డీఎల్‌ఈడీ/ డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 1-5వ తరగతులకు పేపర్-1, 6-10వ తరగతులక పేపర్-2 నిర్వహిస్తారు. 


పేపర్-1 అర్హతలు..
(i) 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ)/ నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ)/ రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత ఉండాలి.  (లేదా)


(ii) 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ)/ నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ)/ రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్). 2015 డిసెంబరు 23కి ముందు డీఎల్‌ఈడీ/డీఈడీ పూర్తి చేసినవారికి ఈ అర్హతలు ఉండాలి. (లేదా)

(iii)
50 శాతం మార్కులతో డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)/ బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి.


పేపర్-2 అర్హతలు..
(i) 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకామ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు  బీఈడీ/ బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి. (లేదా)


(ii) 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకామ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు  బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి. దీంతోపాటు బీఈడీ/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి. 2015 డిసెంబరు 23కి ముందు డీఎల్‌ఈడీ/డీఈడీ పూర్తి చేసినవారికి ఈ అర్హతలు ఉండాలి. (లేదా)


(iii) 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. (లేదా)


(iv) లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు ఐచ్ఛిక సబ్జెక్టులలో ఒకటిగా సంబంధిత లాంగ్వేజ్‌తో డిగ్రీ ఉండాలి. (లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఒరియంటెల్ లాంగ్వేజ్/ డిగ్రీ (లిటరేచర్) (లేదా) సంబంధిత లాంగ్వేజ్ సబ్జెక్టులో పీజీ డిగ్రీతోపాటు లాంగ్వేజ్ పండిట్ సర్టపికేట్/బీఈడీ (లాంగ్వేజ్, మెథడాలజీ) ఉండాలి. (లేదా)


(v) 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ/బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.    


పరీక్ష షెడ్యూలు..



పేపర్-1 పరీక్ష విధానం: 
పేపర్-1లో 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్ నుంచి 30 పశ్నలు ఉంటాయి. వీటిలో సెక్షన్-1 ఛైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజి-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-2 లాంగ్వేజ్-1-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-3 లాంగ్వేజ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-4 మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-5 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).


పేపర్-2 పరీక్ష విధానం: 
పేపర్-2లో 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. మూడు సెక్షన్ల నుంచి 30 పశ్నల చొప్పున 90 ప్రశ్నలు, ఒక సెక్షన్ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో సెక్షన్-1 ఛైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజి-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-2 లాంగ్వేజ్-1-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-3 లాంగ్వేజ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-4 మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).


అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40% గా నిర్ణయించారు.


ముఖ్యమైన తేదీలు..


➥ టెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి: 01.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.08.2023.


➥ హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో:  01.08.2023 - 15.08.2023.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 09.09.2023.


➥ టెట్ పరీక్ష తేదీ: 15.09.2023.


పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.


పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.


Notification - TSTET 2023

Information Bulletin 


Website


ALSO READ:


టీఎస్ టెట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. 
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..


IBPS PO: 3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


1402 పోస్టులతో ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత, తగు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..