India Post Office Recruitment 2022: బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ సంస్థ ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా 19 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి అర్హతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు సెప్టెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలోనే అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి: 19 పోస్టులు
కేటగిరీలవారీగా పోస్టుల కేటాయింపు: జనరల్-07, ఈడబ్ల్యూఎస్-02, ఎస్సీ-04, ఎస్టీ-01, ఓబీసీ-5.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణలై ఉండాలి. లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం అవసరం. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. హోంగార్డు లేదా సివిల్ వాలంటీర్స్‌గా 3 సంవత్సరాల సర్వీస్ ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఎస్సీ-8 సంవత్సరాలు, ఎస్టీ-6 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: డ్రైవింగ్ టెస్ట్, థియరీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రొబేషన్ పీరియడ్: 2 సంవత్సరాలు.
జీత భత్యాలు: నెలకు రూ.19,900. నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు అందుతాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత చిరునామాకు స్పీడ్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా నిర్ణీత తేదీలోగా పంపాలి.
ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.08.2022.
* దరఖాస్తుకు చివరితేది: 26.09.2022.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Manager,
Mail Motor Service,
Bengaluru-560001.
Notification & Application
Website
Also Read:
TSPSC: టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్, రూ.50 వేలకు పైగా జీతం!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
TSPSC Recruitment: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లియండి..