PDUNIPPD Recruitment: న్యూఢిల్లీలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్‌జన్) డిప్యూటేషన్/ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎల్‌డీసీ, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించాలి. రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 09
గ్రూప్ - బి
⏩ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు
గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు.
జీతం: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300- 34800. + GP రూ.4600.
⏩ డిమోన్‌స్ట్రేటర్: 01 పోస్టు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు.
జీతం: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300- 34800. + GP రూ.4200.
⏩ ఆక్యూపేషనల్ థెరఫిస్ట్: 02 పోస్టులు
గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు.
జీతం: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300- 34800. + GP రూ.4200.
⏩ ఫిజియోథెరఫిస్ట్: 01 పోస్టు
గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు.
జీతం: ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300- 34800. + GP రూ.4200.
గ్రూప్ - సి
⏩ జూనియర్ కాలిపర్ మేకర్ కమ్ పీఓ టెక్నీషియన్: 01 పోస్టు
గరిష్ట వయోపరిమితి: 21-30 సంవత్సరాలు.
జీతం: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.
⏩ స్టాఫ్ కార్ డ్రైవర్: 01 పోస్టు
గరిష్ట వయోపరిమితి: డిప్యుటేషన్ కోసం 56 సంవత్సరాలు & డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం 30 సంవత్సరాలు.
జీతం: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.
⏩ లోయర్ డివిజన్ క్లర్క్: 01 పోస్టు
వయోపరిమితి: 18-27 సంవత్సరాలు.
జీతం: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.
⏩ జూనియర్ లింబ్ మేకర్ కమ్ పీఓ టెక్నిషియన్: 01 పోస్టు
వయోపరిమితి: 21-30 సంవత్సరాలు.
జీతం: ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ.1900.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఓబీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు రూ.500. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబధితచిరునామాకు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
“The Director, Pt. Deen Dayal Upadhyaya National Institute for Persons with
Physical Disabilities (Divyangjan), 4, Vishnu Digamber Marg, New Delhi-110002”
ఎంపిక విధానం: రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ జారీ తేది: 06.01.2024.
ALSO READ:
ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, వివరాలు ఇలా
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2023 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..