సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్-2022 పరీక్ష ఫలితాలను మార్చి 3న సీబీఎస్ఈ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో గతేడాది డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7, 2023 వరకు జరిగిన విషయం తెలిసిందే. సీటెట్‌ను 32 లక్షలకుపైగా అభ్యర్థులు రాశారు. పరీక్ష సమాధానాల ఫైనల్ కీ ఫిబ్రవరి 14న విడుదలైంది. అభ్యర్థులు సీబీఎస్ ఈ సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.


సీటెట్-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్) - 2022' నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు.


సీటెట్‌ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్‌(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్‌ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.


ఈ ఏడాది సీటెట్ పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 2.59 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 74 నగరాల్లోని 243 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్ష నిర్వహించారు.


పరీక్ష విధానం..


✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.


✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.


Also Read:


డీఆర్‌డీవో-జీఆర్‌టీఈలో 150 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
బెంగళూరులోని డీఆర్‌డీవో- గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు నోటిఫికేషన్ జారీచేసింది. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 16 వరకు తమ దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...