CSIR Recruitment: న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR) సెక్షన్ ఆఫీసర్ (Section Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్ స్టెనోగ్రాఫర్ (Senior Stenographer), సంబంధిత విభాగాలలో ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు ఆన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 280
1) సెక్షన్ ఆఫీసర్: 62
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-22, ఫైనాన్స్ & అకౌంట్స్-20, స్టోర్స్ & పర్చేజ్-20,
అర్హత: సీనియర్ స్టెనోగ్రాఫర్, సంబంధిత విభాగాలలో ఏదైనా డిగ్రీ ఉండాలి.
జీతం: రూ.47600 -151100.
2) ప్రైవేట్ సెక్రటరీ: 48
అర్హత: సీనియర్ స్టెనోగ్రాఫర్, ఏదైనా విభాగాలలో డిగ్రీ ఉండాలి.
జీతం: రూ.47,600 -1,51,100.
3) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 170
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-113, ఫైనాన్స్ & అకౌంట్స్-32, స్టోర్స్ & పర్చేజ్-25.
అర్హత: సీనియర్ స్టెనోగ్రాఫర్, సంబంధిత విభాగాలలో ఏదైనా డిగ్రీ ఉండాలి.
జీతం: రూ.44,900-1,42,400.
పరీక్ష విధానం:
సెక్షన్ ఆఫీసర్ & ప్రైవేట్ సెక్రటరీ:
➥ పేపర్- I: 100 మార్కులు, సమయం: 2 గంటలు. సబ్జెక్టులు: నోటింగ్, డ్రాఫ్టింగ్ & Precis Writing(Descriptve).
➥ పేపర్- II: 100 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
➥ సమయం: 1.30 గంటలు. సబ్జెక్టులు: జనరల్ నాలెడ్జ్, కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ రూల్స్, సీఎస్‌ఐఆర్‌కు సంబంధించిన రెగ్యులేషన్స్ & లా.
➥ పేపర్- III: స్పెషలైజ్‌డ్ నాలెడ్జ్. 100 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల చొప్పున కోత విధిస్తారు. సమయం: 1.30 గంటలు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్:
➥ పేపర్- I: సబ్జెక్టులు: లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ అండ్ Precis Writing(Descriptve). 100 మార్కులు, సమయం: 2 గంటలు.
➥ పేపర్- II: సబ్జెక్టులు: సీఎస్‌ఐఆర్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ బై లాస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ రూల్స్. 100 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల చొప్పున కోత విధిస్తారు. సమయం: 1.30 గంటలు. ప్రశ్నాపత్రం ఇంగ్లీషు, హిందీ మాధ్యమంలో ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, హైదారాబాద్, కోల్‌కతా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.01.2024.
ALSO READ:
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో 74 పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్(AIESL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ - సపోర్ట్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ గేట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 వరకు పోస్ట్/ స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా సంబంధిత చిరునామాకు దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..