కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌), కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. గేట్-2023లో ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 13న ప్రారంభంకాగా.. అక్టోబరు 12 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. 


వివరాలు..


* మేనేజ్‌మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్‌: 560 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్-351, సివిల్- 172, జియాలజీ- 37.


అర్హత: డిగ్రీ(మైనింగ్/సివిల్ ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ/ఎంఈ, ఎంటెక్‌ (జియాలజీ/అప్లయిడ్ జియాలజీ/జియోఫిజిక్స్/అప్లయిడ్ జియోఫిజిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 అర్హత సాధించి ఉండాలి.


వయోపరిమితి: 31.08.2023 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. 


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: గేట్-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


జీత భత్యాలు: నెలకు రూ.50,000- రూ.1,60,000.


ముఖ్యమైన తేదీలు:


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.09.2023.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.10.2023.


Notification


Online Application


ALSO READ:


నిమ్స్‌లో 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా
ఉస్మానియా యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఎంబీఏ, ఎంసీఏ అర్హత ఉన్నవారికి 60 శాతం మార్కులు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో బయోడేటా పూర్తి వివరాలతోపాటు, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను జతచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎస్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..