సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుదారులు(పురుషులు) CISF అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ www.cisfrectt.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సీఐఎస్ఎఫ్ లో మొత్తం 1149 ఖాళీలను భర్తీ చేస్తుంది. మార్చి 4, 2022 సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. 



  • CISF రిక్రూట్‌మెంట్ 2022: విద్యార్హత 


అభ్యర్థులు సైన్స్ సబ్జెక్ట్‌తో గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుంచి క్లాస్ 12 లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.



  • వయో పరిమితి 


మార్చి 4, 2022 నాటికి అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయో పరిమితి 23 సంవత్సరాలు.



  • పే స్కేల్ 


పే లెవల్-3: రూ. 21,700-69,100



  • ఎంపిక ప్రక్రియ


అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష (RME) అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), OMR/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)  కింద రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)/ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME), రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. 


సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు


సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉద్యోగాల భర్తీకి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. దీంతో మొత్తం 249 హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఖాళీల సంఖ్య వివరాల కోసం అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ వెబ్‌సైట్ https://cisfrectt.in/ ఉంచింది. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో వెల్లడించిన క్రీడల్లో రాణించినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 3,2022 చివరి తేదీ. సీఐఎస్ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, క్రీడార్హతలు స్పష్టంగా తెలుసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తుల్ని పోస్టులో నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపించాలి. 


జనరల్ డ్యూటీలోని మొత్తం 249 ఖాళీల్లో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) మేల్- 181, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఫీమేల్- 68 పోస్టులున్నాయి. ఇంటర్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయో పరిమితి 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100 కాగా మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు చెల్లించక్కర్లేదు.