రాంచీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ(సీఐపీ) గ్రూప్ 'ఎ'  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీన  ఇంటర్వ్యూకి హజరు కావల్సి ఉంటుంది. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 31


* గ్రూప్ 'ఎ' పోస్టులు


పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు..


⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ: 12


⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ: 03


⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసర్జరీ: 02


⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియో-డయాగ్నోసిస్: 02


⏩ ప్రొఫెసర్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ: 02


⏩ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ: 01


⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ: 04


⏩ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్: 01


⏩ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్: 01


⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్: 02


⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో సైకాలజీ: 01


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.82000-రూ.114000 చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: Central Institute of Psychiatry, 
                                 Kanke, Ranchi-834006, Jharkhand.


ఇంటర్వ్యూ తేది: 08.08.2023.


ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30.


Notification


Website


ALSO READ:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial