కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి.


పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.


వివరాలు..


*  కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్): 9,212 (మెన్- 9105; ఉమెన్-107)


మెన్ కేటగిరీ పోస్టులు: డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయి కర్మచారి.


ఉమెన్ కేటగిరీ పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సెర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్.


అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.


వయోపరిమితి: 01.08.2023 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


పరీక్ష ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.


ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషీయన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కుల్కు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో హిందీ/ ఇంగ్లిష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్- 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్- 25 ప్రశ్నలు-25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథ్స్- 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. 


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్.


ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపుం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


జీత భత్యాలు: నెలకు రూ.21,700- రూ.69,100.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.04.2023.


➥ సీబీటీ అడ్మిట్ కార్డ్ విడుదల: 20.06.2023 - 25.06.2023 వరకు.


➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 01.07.2023 - 13.07.2023 వరకు.


Website


                                       


Also Read:


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...