రీరానికి సుమారు పదమూడు విటమిన్లు అవసరం ఉంటుంది. ఎక్కువగా విటమిన్ A, C, E గురించే ఆలోచిస్తారు కానీ వాటితో పాటు విటమిన్-K కూడా చాలా ముఖ్యం. గాయాల నుంచి రక్తం కారకుండా గడ్డకట్టేలా చేయడంలో విటమిన్-K కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం గడ్డకట్టడానికి, ఎముకల నిర్మాణానికి అవసరమైన వివిధ ప్రోటీన్లను తయారు చేస్తుంది. ఇది కొవ్వులో కరిగే పోషకం. ఫైలో క్వినోన్, మెనా క్వినోన్ అనే రెండు రూపాల్లో లభిస్తుంది. ఫైలో క్వినోన్ మొక్కల నుంచి వస్తే రెండోది మెనాక్వినోన్స్ బ్యాక్టీరియా ద్వారా శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్-K లోపం తలెత్తితే మీకు ఏదైనా గాయం అయినప్పుడు ఆగకుండా రక్తం కారుతూనే ఉంటుంది. అధిక రక్తస్రావం జరగడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే విటమిన్-K ఉన్న ఆహారాలు మీ డైట్లో చేర్చుకోవాలి.


క్యాబేజ్: క్యాబేజ్ వంటి గ్రీన్ క్రూసిఫెరస్ కూరగాయల్లో విటమిన్-K అధికంగా ఉంటుంది. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం అర కప్పు వండిన క్యాబేజ్ లో 81.5 మైక్రోగ్రాముల విటమిన్-K ఉంటుంది.


కాలే: ఆకుపచ్చని కాలే విటమిన్-K అద్భుతమైన మూలం. ఇందులో విటమిన్ ఏ, సి కూడా ఉంటుంది. కాల్షియం, పొటాషియం లోడ్ చేయబడి ఉంటాయి. ఎముకలకు కావలసిన బలాన్ని అందిస్తాయి.


బ్రకోలి: ఫైబర్, కాల్షియం, విటమిన్ సి తో పాటు విటమిన్-K కూడా ఉంటుంది. అర కప్పు వండిన బ్రకోలిలో 110 మైక్రోగ్రాముల విటమిన్-K లభిస్తుంది.


కొల్లార్డ్ గ్రీన్స్: ఈ ఆకుకూరల్లో కాల్షియం, విటమిన్-K సమృద్ధిగా ఉంటాయి. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం ఒక కప్పు ఉడకబెట్టిన కొల్లార్డ్ గ్రీన్స్ లో 770 మైక్రోగ్రాముల విటమిన్-K అందుతుంది.


బచ్చలికూర: ఆరోగ్యకరమైన ఆకుపచ్చ ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. ఇందులో మెగ్నీషియం, ఫోలేట్, ఐరన్ తో పాటు విటమిన్ A, B, E పుష్కలంగా ఉంటాయి. ఇందులో డైటరీ విటమిన్-K అధికంగా ఉంటుంది.


బ్రసెల్స్ మొలకలు: కొన్ని నివేదికల ప్రకారం బ్రసెల్స్ మొలకల్లో విటమిన్-K ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా నిరోధించి, ఎముకల నిర్మాణానికి సహకరిస్తుంది. బఠానీ సైజులో ఉండే క్యాబేజీల్లా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల క్యాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.


ఉల్లికాడలు: స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్ A, C, ఫోలేట్ తో పాటు విటమిన్-K కూడా పుష్కలంగా ఉంటుంది.


కివి: పోషకాల పవర్ హౌస్ గా కివీ గురించి చెప్తారు. ఇందులో విటమిన్-K సమృద్ధిగా లభిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం కప్పు కివీలో సుమారు 73 mcg అందిస్తుంది.


బెర్రీలు: బ్లాక్ బెర్రీస్ వంటి బెర్రీల్లో అధిక మొత్తంలో విటమిన్-K ఉంటుంది. ఫైబర్, విటమిన్ C, ఐరన్, విటమిన్లు B కూడా లభిస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ మసాలాలు తిన్నారంటే మీ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!