ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్య అధిక కొలెస్ట్రాల్. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ సహ అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మందులు, జీవనశైలిలో మార్పులతో అధిక కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకునేందుకు సహాయపడతాయి. శరీరానికి తగిన శారీరక శ్రమ చాలా అవసరం. ఇవే కాదు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వంట గదిలో దొరికే స్పైసెస్ కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఐదు రకాల సుగంధ ద్రవ్యాలు (మసాలాలు) తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అవేంటంటే..


దాల్చిన చెక్క


కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలని తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. సిన్నమాల్డిహైడ్, సిన్నమిక్ యాసిడ్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తంలో కనిపించే కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇదే కాదు రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచేందుకు దాల్చిన చెక్క పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు దాల్చిన చెక్క టీ లేదా మరొక విధంగా దీన్ని తీసుకుంటే మంచిది.


అల్లం


గొప్ప ఔషధ గుణాలు కలిగిన అల్లం మసాలా ఘాటుగా ఉండటమే కాదు కొవ్వుని కరిగించేస్తుంది. ఇందులో జింజెరోల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ధమనుల్లో ఫలకాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.


నల్లమిరియాలు


నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. కాలేయంలో కొలెస్ట్రాల్ ఉండకుండా అడ్డుకుంటుంది. పిత్త ఆమ్లాల స్రావాన్ని పెంచుతుంది. ఆహారం జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడిక్సల్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


మెంతులు


భారతీయులు తప్పనిసరిగా మెంతులు వంటల్లో వినియోగిస్తారు. ఇందులో సపోనిన్స్ అనే సమ్మేళనం ఉంది. దీనికి కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణం ఊదీ. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది. అంతే కాదు మెంతులు జీర్ణక్రియని మెరుగుపరచడంలో సహాయపడతాయి. శరీరంలోని మంటలు తగ్గిస్తాయి. ఇది ఆరోగ్య పరంగా మాత్రమే కాదు అందానికి జుట్టు సంరక్షణకి ఉపయోగపడుతుంది. మెంతిపొడి జుట్టుకి పెట్టుకుంటే వెంట్రుకలకు పోషణ లభిస్తుంది.


పసుపు


సంప్రదాయ వైద్యంలో వేళ సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న స్పైసెస్ పసుపు. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మంటని తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలని కంట్రోల్ లో ఉంచుకుంటుంది. కర్కుమిన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా చేయడంలో సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కంటి చూపుని పోగొట్టే గ్లకోమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే