Central Prison Recruitment: నెల్లూరు సెంట్రల్ జైలు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్-II, వైర్‌మ్యాన్, బార్బర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ (టైలరింగ్/ ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 03

⏩ టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్-II: 01

అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా ITVDLTC (జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ) ద్వారా జారీ చేయబడిన టైలరింగ్ ట్రేడ్‌లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

అనుభవం: టైలరింగ్ ట్రేడ్‌లో 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.  ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

వేతనం: నెలకు రూ.18,500.

⏩ వైర్‌మ్యాన్: 01

అర్హత: ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్ ట్రేడ్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

అనుభవం: ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్ ట్రేడ్‌లో 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.  ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

వేతనం: నెలకు రూ.18,500.

⏩ బార్బర్: 01 

అర్హత: 7వ తరగతి ఉత్తీర్ణులై తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. హెయిర్ స్టైల్స్ కోర్సు యొక్క ఏదైనా ఇతర సంబంధిత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

అనుభవం: బార్బర్‌గా హెయిర్ కట్ & స్టైలింగ్ సేవల్లో 01 సంవత్సరం అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.  ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

వేతనం: నెలకు రూ.15,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దనఖాస్తులు పంపాల్సిన చిరునామా: Superintendent of jails, Central prison, Kakuturu Village, Chemudugunta post, Venkatachatam Mandat, SPSR Nellure District- 524320.(Contact Number: 9985195894)

ఎంపిక విధానం:  మెరిట్&రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

➥ టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్-II/వైర్‌మ్యాన్:  మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. అందులో 50 మార్కులు అకడమిక్ క్వాలిఫికేషన్, 15 మార్కులు పని అనుభవానికి, 25 మార్కులు స్కిల్ టెస్ట్, 10 మార్కులు సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి వెయిటేజీకి 10 మార్కులు కేటాయించారు.

➥ బార్బర్: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. అందులో 50 మార్కులు అకడమిక్ క్వాలిఫికేషన్, 25 మార్కులు పని అనుభవానికి, 25 మార్కులు స్కిల్ టెస్ట్‌కి కేటాయించారు. 

దరఖాస్తుకు జతపరచవల్సిన సర్టిఫికేట్‌లు..

➥ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో

➥ ఎస్‌ఎస్‌సీ మార్క్స్ మెమో లేదా తత్సమాన సర్టిఫికేట్‌ కాపీ.

➥ అన్ని సంవత్సరాల క్వాలిఫైయింగ్ పరీక్షల మార్కుల మెమో కాపీలు. 

➥ లేటెస్ట్ ఎస్సీ/ఎస్టీ/బీసీల కాస్ట్ సర్టిఫికేట్‌ కాపీ.

➥ ఓసీ అభ్యర్థుల కోసం లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాపీ.

➥ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ కాపీ.

➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్.

➥ ఆధార్ సర్టిఫికేట్.  

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 24.02.2024.

Notification

Application Form

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..