central bank of india admitcard: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 192 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులును అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబరు, పాస్‌వర్డ్/ పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 10 వరకు అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 10న రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌కార్డులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డులను తీసుకెళ్లాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ. 36000 – 100000 గౌరవ వేతనం ఇవ్వబడుతుంది.
హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ CBI స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - www.centralbankofindia.co.in
➥ అక్కడ హోంపేజీలో కనిపించే Recruitment లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ అందులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ విభాగంలో అడ్మిట్ కార్డులకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబరు, పాస్‌వర్డ్/ పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
➥ అభ్యర్థుల అడ్మిట్‌కార్డులు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
➥ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
➥ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌కార్డులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డులను తీసుకెళ్లాలి.
అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
రాతపరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలుంటాయి. వీటిలో బ్యాంకింగ్-60 ప్రశ్నలు- 60 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్-20 ప్రశ్నలు-20 మార్కులు, బ్యాంకింగ్, ఎకనామిక్స్ & జనరల్ అవేర్‌నెస్ నుంచి-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు అమలుచేస్తారు. ప్రతి సరైన సమాదానానికి ఒకమార్కు ఉంటుంది. ప్రతి తప్పుసమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత ఉంటుంది.
ALSO READ:
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 106 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 106 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్, బీబీఏ, గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీఎస్‌డబ్ల్యూతో పాటు పని అనుభవం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు రూ.33400, రెండవ సంవత్సరం నెలకు రూ.35100, మూడవ సంవత్సరం నెలకు రూ. 36900 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..