Central Bank Recruitment of Junior Management Grade Scale I: ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ(IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్‌తో సహా) లేదా తత్సమానం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 09వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.175. ఇతరులు రూ.850 చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 266

జోన్‌ల వారీగా ఖాళీలు..

⏩ అహ్మదాబాద్: 123 పోస్టులుకేటగిరీ వారీగా: ఎస్సీ- 18 పోస్టులు, ఎస్టీ- 09 పోస్టులు, ఓబీసీ- 33 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 12 పోస్టులు, జనరల్- 51 పోస్టులు.రాష్ట్రాలు: గుజరాత్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ.లాంగ్వేజ్: గుజరాతీ.

⏩ చెన్నై: 58 పోస్టులుకేటగిరీ వారీగా: ఎస్సీ- 08 పోస్టులు, ఎస్టీ- 04 పోస్టులు, ఓబీసీ- 15 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 05 పోస్టులు, జనరల్- 26 పోస్టులు.రాష్ట్రాలు:: తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ.లాంగ్వేజ్: తమిళం & మలయాళం.

⏩ గువహతి: 43 పోస్టులుకేటగిరీ వారీగా: ఎస్సీ- 06 పోస్టులు, ఎస్టీ- 03 పోస్టులు, ఓబీసీ- 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 04 పోస్టులు, జనరల్- 19 పోస్టులు.రాష్ట్రాలు: అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం & త్రిపుర.లాంగ్వేజ్: అస్సామీ, బెంగాలీ, బోడో, మణిపురి, గారో, ఖాసీ, మిజో & కోక్‌బోరోక్.

⏩ హైదరాబాద్: 42 పోస్టులుకేటగిరీ వారీగా: ఎస్సీ- 06 పోస్టులు, ఎస్టీ- 03 పోస్టులు, ఓబీసీ- 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 03 పోస్టులు, జనరల్- 19 పోస్టులు.రాష్ట్రాలు: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ & కర్నాటక.లాంగ్వేజ్: తెలుగు, కన్నడ.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ(IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్‌తో సహా) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 30.11.2024 నాటికి 21-32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అండ్ మహిళా అభ్యర్థులు రూ.175 + జీఎస్టీ. ఇతరులు రూ.850 + జీఎస్టీ చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష- 120 మార్కులు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్-30 మార్కులు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లీషు, బ్యాంకింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, ప్రెజెంట్ ఎకనామిక్ స్కెనారియో & జనరల్ అవేర్‌నెస్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ఇంటర్వ్యూ: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్: దరఖాస్తు చేసిన జోన్ యొక్క స్థానిక భాష కోసం (ఎంపికైన అభ్యర్థుల కోసం).

జీతం: రూ.48,480 – రూ.85,920.

తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు: తెలంగాణ- హైదరాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్- గుంటూరు/విజయవాడ, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2025

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.02.2025

🔰 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి 2025

Notification

Online Application  

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..