Kids who played roles of husband and wife in kindergarten get married 20 years later:
ఇరవై ఏళ్ల కిందట.. ఓ కిండర్ గార్టెన్ స్కూల్
ఆ రోజు స్కూల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఉన్నాయి. ప్లే స్కూల్, ఎల్ కేజీ, యూకేజీ ఇలా అన్ని క్లాసుల్ని కలిపేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అందరూ ..ఎవరికి తోచిన ఫ్యాన్సీ డ్రెస్ లో వారు పంపారు. ఓ పిల్లవాడి తల్లి తన కుమారుడ్ని పెళ్లి కొడుకు డ్రెస్ లో పంపింది. ఓ పిల్ల తల్లి తమ కూతుర్ని పెళ్లి కుమార్తె డ్రెస్‌లో పంపింది. స్కూల్లో వీరిద్దరితో పెళ్లి ఆట ఆడించారు. ఫోటోలు తీశారు. అప్పటితే ఎపిసోడ్ అయిపోయింది.
ఇరవై ఏళ్ల తర్వాత ఓ కల్యాణ మండపం
ఓ యువతి, యువకుడి పెళ్లి హుషారుగా జరిగింది. ఆటపాటలతో అందరూ హాయిగా గడిపారు. కాసేపటి తర్వాత వాళ్లకో నిజం తెలిసింది. అదేమిటంటే తమకు ఇరవై ఏళ్ల కిందటే పెళ్లి అయిందని. ఓ వ్యక్తి ఫోటో షేర్ చేయడంతో ఈ విషయం వారికి తెలిసింది. ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. ఎందుకంటే .. ఇరవై ఏళ్ల కిందట పెళ్లి అయింది నిజంగా కాదు. ఆటలో. కిండర్ గార్టెన్ స్కూళ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆ పెళ్లి జరిగింది. నిజానికి వారిద్దరూ ఒక్క క్లాస్ కాదు. తర్వాత కూడా వారు ఫ్రెండ్స్ కాదు. కానీ యాధృచ్చికంగా అలా పెళ్లి జరిగిపోయింది.
జీవితమంటేనే ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మంచివి.. కొొన్ని అద్భుతమైనవి ఉంటాయి. అలాంటి ఓ ఘటన ఆ జంట జీవితాల్లో జరిగింది. చిన్నప్పుడు కిండర్ గార్టెన్ స్కూల్లో వారు భార్య, భర్తలుగా నటిస్తూ ఓ నాటకం వేశారు. దాన్ని వారు మర్చిపోయి ఉంటారు. కానీ ఇరవై ఏళ్ల తర్వాత వారు నిజంగానే పెళ్లి చేసుకున్నారు. ఘటన చైనాలోని ఓ పట్టణంలో జరిగింది.
పైన తథాస్తు దేవతలుంటారని మన దగ్గర చెబుతూ ఉంటారు. చైనాలో అలాంటి సామెతలు , కథలు ఉన్నాయో లేవో కానీ ఈ యువజంట విషయంలో మాత్రం నిజం అయింది. చిన్నప్పుడు అలా భార్య, భర్తల వేషం వేస్తే ఇప్పుడు నిజంగానే ఆ రోల్స్ లోకి వచ్చేశారు. అందుకే దేవుడిరాతను ఎవరూ తప్పించుకోలేరని ఉంటారు.
Also Read: Sharon Raj Murder Case: ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!