CDAC Jobs in Tiruvananthapuram:


తిరువనంతపురంలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 29లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


వివరాలు...


మొత్తం ఖాళీలు: 54


పోస్టులు: ప్రాజెక్ట్‌ మేనేజర్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌.


విభాగాలు: కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితరాలు.


అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. (లేదా) పీజీ డిగ్రీ (జియోలజీ/జియోఇన్‌ఫర్మాటిక్స్/జియోగ్రఫీ


పని అనుభవం: కనీసం 0-9 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30-50 సంవత్సరాల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.25,000-రూ.1.1లక్షలు చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వేదిక: CDAC, Vellayambalam, Thiruvananthapuram.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌‌కు చివరితేది: 28.09.2023.


➥ ఇంటర్వ్యూ తేది: 03.10.2023 నుంచి 06.10.2023 వరకు.


➥ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి 11 వరకు.


Notification


Website


ALSO READ:


ఎయిమ్స్‌-కళ్యాణిలో 120 గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ ఆయుష్ విభాగంలో టీచింగ్ పోస్టులు, అర్హతలివే
సికింద్రాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ, ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డా. హైదరాబాద్ ఎర్రగడ్డలోని బీఆర్‌కేఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్‌లోని డాక్టర్ ఏఎల్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుర్వేదంలో పీజీ డిగ్రీతోపాటు టీచింగ్ అనుభవం కలిగనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..