CDAC Project Staff Posts: సీడాక్ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 857 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీల్లో.. హైదరాబాద్ సెంటర్‌లో 56 పోస్టులు, బెంగళూరు సెంటర్‌లో 83 పోస్టులు, చెన్నై సెంటర్‌లో 135 పోస్టులు, ఢిల్లీ సెంటర్‌లో 24 పోస్టులు, ముంబయి సెంటర్‌లో 18 పోస్టులు, మొహాలి సెంటర్‌లో 11 పోస్టులు, నోయిడా సెంటర్‌లో 170 పోస్టులు, పుణే సెంటర్‌లో 230 పోస్టులు, పాట్నా సెంటర్‌లో 19 పోస్టులు, తిరువనంతపురం సెంటర్‌లో 91 పోస్టులు, సిల్చార్ సెంటర్‌లో 20 పోస్టులు ఉన్నాయి.
వివరాలు..
* ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 857
కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది.
⫸ సీడ్యాక్-హైదరాబాద్
ఖాళీల సంఖ్య: 56 పోస్టులు
➥ ప్రాజెక్ట్ అసోసియేట్: 13 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 26 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్ట్‌నర్: 03 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్: 02 పోస్టులు
➥ ప్రాజెక్ట్ టెక్నీషియన్: 01 పోస్టు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 11 పోస్టులు
⫸ సీడ్యాక్-బెంగళూరు
ఖాళీల సంఖ్య: 83 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 45 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్‌నర్: 01 పోస్టు
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్: 03 పోస్టులు
➥ ప్రాజెక్ట్ సర్వీస్ అండ్ సపోర్ట్: 05 పోస్టులు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ / అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ : 25 పోస్టులు
➥ టెక్నికల్ స్పెషలిస్ట్: 04 పోస్టులు
⫸ సీడ్యాక్-ఢిల్లీ
ఖాళీల సంఖ్య: 24 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 15 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్‌నర్: 02 పోస్టులు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్: 07 పోస్టులు
⫸ సీడ్యాక్-చెన్నై
ఖాళీల సంఖ్య: 135 పోస్టులు
➥ ప్రాజెక్ట్ అసోసియేట్: 30 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 50 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్ట్‌నర్: 01 పోస్టు
➥ ప్రాజెక్ట్ టెక్నీషియన్: 30 పోస్టులు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్: 24 పోస్టులు
⫸ సీడ్యాక్-ముంబయి
ఖాళీల సంఖ్య: 18 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 08 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్‌నర్: 03 పోస్టు
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్: 01 పోస్టు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్: 06 పోస్టులు
⫸ సీడ్యాక్-మొహాలి
ఖాళీల సంఖ్య: 11 పోస్టులు
ప్రాజెక్ట్ అసోసియేట్: 02 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 06 పోస్టులు
ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్ట్‌నర్: 03 పోస్టులు
⫸ సీడ్యాక్-నోయిడా
ఖాళీల సంఖ్య: 170 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 103 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్: 10 పోస్టులు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్: 57 పోస్టులు
⫸ సీడ్యాక్-పుణే
ఖాళీల సంఖ్య: 230 పోస్టులు
➥ ప్రాజెక్ట్ అసోసియేట్: 43 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 100 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్‌నర్: 20 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్: 03 పోస్టులు
➥ ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 05 పోస్టులు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్: 59 పోస్టులు
⫸ సీడ్యాక్-పాట్నా
ఖాళీల సంఖ్య: 19 పోస్టులు
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 08 పోస్టులు
➥ ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్‌నర్: 01 పోస్టు
➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్: 10 పోస్టులు
⫸ సీడ్యాక్-తిరువనంతపురం
ఖాళీల సంఖ్య: 91 పోస్టులు
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 03 పోస్టులు
ప్రాజెక్ట్ అసోసియేట్: 02 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 78 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్: 01 పోస్టు
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 07 పోస్టులు
⫸ సీడ్యాక్-సిల్చార్
ఖాళీల సంఖ్య: 20 పోస్టులు
ప్రాజెక్ట్ అసోసియేట్: 06 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 11 పోస్టులు
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 01 పోస్టు
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 02 పోస్టులు
అర్హతలు: బీఈ/బీటెక్ (లేదా) ఎంఈ/ఎంటెక్ (లేదా) పీజీ డిగ్రీ (సైన్స్/కంప్యూటర్ అప్లికేసన్). సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 0-4 సంవత్సరాలు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 3-7 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు అనుభవం అవసరంలేదు. టెక్నీషియన్ పోస్టులకు ఏడాది అనుభవం ఉండాలి
వయోపరిమితి: 30 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.08.2024.
Notification & Online Application