C-DAC Recruitment: సీడాక్‌లో 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్‌) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

Continues below advertisement

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్‌) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

మొత్తం ఖాళీలు: 570

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషెన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ & ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికాం కమ్యూనికేషన్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, PCB డిజైన్, జియో ఫిజిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, VLSI డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, సిస్టమ్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, ఎన్విరాన్‌మెంట్/అట్మోస్పెరిక్ సైన్స్, సైంటిఫిక్ కంప్యూటింగ్, ఓషన్ సైన్స్, రిమోట్ సెన్సింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, జియోఫిజిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్ / బయో టెక్నాలజీ, డిజైన్, సివిల్, మెకానికల్ మెకాట్రానిక్స్, ఎడ్యుకేషన్ & ట్రైనింగ్, ఫిజిక్స్ / అప్లైడ్ ఫిజిక్స్, మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, మల్టీమీడియా, ఎనీ అధర్ అల్లైడ్ ఫల్డ్.

పోస్టుల వారీగా ఖాళీలు..

➥ ప్రాజెక్ట్ అసోసియేట్: 30

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

జీతం: సంవత్సరానికి రూ.3.6 లక్షలు - రూ.5.04 లక్షలు చెల్లిస్తారు.

➥ ప్రాజెక్ట్ ఇంజనీర్/మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 300

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

పని అనుభవం: కనీసం 0-4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

జీతం: సంవత్సరానికి రూ.4.49 లక్షలు - రూ.7.11 లక్షలు చెల్లిస్తారు.

➥ ప్రాజెక్ట్ మేనేజర్/ప్రోగ్రామ్ మేనేజర్/ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్/ప్రొడక్ట్ సర్వీస్ & ఔట్రీచ్(PS&O) మేనేజర్: 40

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

పని అనుభవం: కనీసం 9-15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.

జీతం: సంవత్సరానికి రూ.12.63 లక్షలు - రూ.22.9 లక్షలు చెల్లిస్తారు.

➥ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/మాడ్యూల్ లీడ్/ప్రాజెక్ట్ లీడ్/ప్రొడ్. సర్వీస్ & ఔట్రీచ్(PS&O) ఆఫీసర్: 200

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

పని అనుభవం: కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

జీతం: సంవత్సరానికి రూ.8.49లక్షలు-రూ.14లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పని ప్రదేశం: బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, మొహాలీ, ముంబై, నోయిడా, పుణె, తిరువనంతపురం, పట్నా, జమ్మూ, సిల్‌చర్, పుణెలోని కార్పొరేట్ కార్యాలయం, గువాహటి, శ్రీనగర్, చండీగఢ్

దరఖాస్తుకు చివరితేది: 20.02.2023. 

Project Associate Notification& Application

Project Engineer Notification& Application  

Project Manager Notification& Application  

Senior Project Engineer Notification& Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola