BSF Recruitment: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులని అనుసరించి 10 + 2 లేదా తత్సమానం, సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు ఎస్‌ఐ(స్టాఫ్ నర్సు)కు రూ.200, ఏఎస్‌ఐ(ల్యాబ్ టెక్నీషియన్), ఏఎస్‌ఐ(ఫిజియోథెరపిస్ట్) పోస్టులకు రూ.100. సరైన అర్హతలున్న పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 17 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, నాలెడ్జ్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 85
1. ఎస్‌ఐ(స్టాఫ్ నర్స్): 14 పోస్టులు
అర్హత: 10 + 2 లేదా తత్సమానం, డిగ్రీ/డిప్లొమా(జనరల్ నర్సింగ్ పోగ్రామ్) ఉత్తీర్ణతతో పాటు జనరల్ నర్స్ అండ్ మిడ్‌వైఫ్ సెంట్రల్ లేదా స్టేట్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.35,400 – రూ.1,12,400.
2. ఏఎస్‌ఐ(ల్యాబ్ టెక్నీషియన్): 38 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో 10 + 2 లేదా తత్సమానం, డిప్లొమా(మెడికల్ లాబోరేటరీ టెక్నాలజీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.29,200 – రూ.92,300.
3. ఏఎస్‌ఐ(ఫిజియోథెరపిస్ట్): 47 పోస్టులు
అర్హత: సైన్స్ సబ్జెక్ట్‌తో 10 + 2 లేదా తత్సమానం, డిగ్రీ/డిప్లొమా( ఫిజియోథెరపి) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 20 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.29,200 – రూ.92,300.
దరఖాస్తు ఫీజు: ఎస్‌ఐ(స్టాఫ్ నర్సు)కు రూ.200, ఏఎస్‌ఐ(ల్యాబ్ టెక్నీషియన్), ఏఎస్‌ఐ(ఫిజియోథెరపిస్ట్) పోస్టులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, నాలెడ్జ్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.06.2024.
ALSO READ:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 'ఏఎఫ్‌క్యాట్' నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రారంభం ఎప్పడంటే?
Indian Air Force AFCAT Notification: భారత వైమానిక దళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 02/2024 (AFCAT 02/2024) నోటిఫికేషన్ విడుదలైంది. వైమానిక దళంలో టెక్నికల్ (Technical), నాన్ టెక్నికల్ (Non Technical) విభాగాల్లో 304 ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 30న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఎంపికైనవారికి 2025 జులైలో కోర్సులు ప్రారంభంకానున్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి