నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (బిమ్‌టెక్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీ/ఎఫ్‌పీఎం/ పీజీడీఎం/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.


వివరాలు...


1) అసిస్టెంట్ ప్రొఫెసర్


2)  అసోసియేట్ ప్రొఫెసర్ 


విభాగాలు:


ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెసిషన్ సైన్సెస్
➥ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
➥ డెసిషన్ సైన్సెస్
➥ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్


మార్కెటింగ్, రిటైల్ మేనేజ్‌మెంట్
➥ ప్రొడక్ట్ & బ్రాండ్ మేనేజ్‌మెంట్
➥ మార్కెటింగ్ ఆఫ్ సర్వీసెస్
➥ కన్జ్యూమర్ బిహేవియర్
➥ మార్కెటింగ్ రిసెర్చ్


స్ట్రాటజీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
➥ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
➥ బిజినెస్ 4.0/5.0
➥ డిజైన్ థింకింగ్


ఐటీ
➥ సైబర్ సెక్యూరిటీ
➥ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్
➥ ఎమర్జింగ్ టెక్నాలజీస్
➥ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (AI IoT)


బిజినెస్ కమ్యునికేషన్
➥ ఎఫెక్టివ్ మేనేజిరియల్ కమ్యూనికేషన్
➥ అప్లయిడ్ కమ్యూనికేషన్


ఇంటర్నేషనల్  బిజినెస్
➥ జియోపాలిటిక్స్
➥ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)
➥ ఇంటర్నేషనల్ రిలేషన్స్ 
➥ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ సెటిల్‌మెంట్


అర్హత..
➥ సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీ/ఎఫ్‌పీఎం/ పీజీడీఎం/ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ అభ్యర్థులు హయ్యర్ సెకండరీ పరీక్ష (12వ తరగతి) నుంచి అకడమిక్ పరీక్షల్లో కనీసం 60% మార్కులు సాధించాలి. 
➥ పీహెచ్‌డీ/ఎఫ్‌పీఎం థీసిస్‌లను సమర్పించి, డిగ్రీ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


వయసు: 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: ఎంపికైనవారికి రూ.12 లక్షలు - రూ.15 లక్షల వార్షిక వేతనం ఇస్తారు. 


దరఖాస్తుకు చివరితేది: 22.03.2023.


ఈమెయిల్: recruitments@bimtech.ac.in


Notification (Faculty)


 Website


 


Faculty Application Form 2023

Annexure-1 of faculty Application Form 2023 

Also Read:


NFC Jobs: హైదరాబాద్‌-న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో 124 ఖాళీలు- అర్హతలివే!
హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ‌పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను ప్రకారం అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమనా విద్యార్హత, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


NALSAR: నల్సార్ యూనివర్సిటీలో 58 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వివిధ ఫ్యాకల్టీ, ఇతర అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఐజీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత, నెట్/ స్లెట్/ సెట్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 31లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...