రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి. ఆకట్టుకునేలా ఎలా క్రియేట్ చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగాలు ఇచ్చే వాళ్లను ఇంప్రెస్‌ చేయవచ్చు. డిగ్రీలు పూర్తి చేసిన ప్రతి ఒక్క కుర్రాడి ఆలోచన ఇదే. దీని కోసం ఇంటర్‌నెట్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ అసలు నెట్‌ ఊసే లేని కాలంలో ఏం చేసేవాళ్లు. రెజ్యూమ్‌లు ఎలా రెడీ చేసేవాళ్లు. అవి ఎలా ఉండేవి. ముఖ్యంగా ప్రపంచంలో రోల్‌మోడల్‌గా ఉన్న వాళ్ల రెజ్యూమ్స్‌ ఎలా ఉండేవనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి వారి కోసమే బిల్‌గేట్స్‌ తన ఫస్ట్‌ రెజ్యూమ్‌ను షేర్‌ చేశారు. 


జాబ్‌ సెర్చింగ్‌లో ఉన్న వాళ్లకు ఓ స్ఫూర్తిని ఇచ్చేలా బిల్‌గేట్స్‌ తన మొదటి రెజ్యూమ్‌ షేర్ చేశారు. లక్షల మందికి, వేల కంపెనీలకు వారధిలా ఉన్న ఓ జాబ్‌ సెర్చింగ్‌ వెబ్‌సైట్‌లో 48 ఏళ్ల నాటి రెజ్యూమ్‌ను ఉంచారు బిల్‌గేట్స్. తాను హార్వార్డ్‌ యూనివర్శిటీలో ఉన్నప్పుడు క్రియట్ చేసిన రెజ్యూమ్‌ ఇది. 


తన 48 ఏళ్ల నాటి రెజ్యూమ్‌ను లింక్డ్‌ఇన్లో బిల్‌గేట్స్ షేర్ చేశారు. షేర్‌ చేస్తూ ఇలా రాసి పెట్టారు.. "మీరు ఈ మధ్య చదువు పూర్తి చేసి ఉంటే... మీ రెజ్యూమ్‌ 48 క్రితం నేను తయారు చేసుకున్న నా రెజ్యూమ్‌ కంటే చాలా మెరుగ్గా ఉంటుంది" అని రాశారు.  


పాత డాక్యుమెంట్‌ పేపర్‌పై కనిపిస్తున్న ఈ రెజ్యూమ్‌ చూస్తే... బిల్‌గేట్స్ చాలా కోర్సులు చేసినట్టు కనిపిస్తోంది. అన్నింట కూడా ఆయన A గ్రేడ్‌లో పాస్‌ అయినట్టు దాన్ని బట్టి తెలుస్తోంది. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట నుంచి మొదలు పెట్టాలి కదా అని బిల్‌గేట్స్‌ రెజ్యూమ్‌పై లింక్డ్‌ఇన్ కామెంట్ చేసింది.  



బిల్‌గేట్స్ రాసుకున్నట్టు ఆ రెజ్యూమ్‌ అంత ఆషామాషీగా లేదు. అందులో ఆయన సాధించిన విజయాలు చూస్తే మతి పోతుంది. తన ఉద్యోగ జీవితంలో ఎలా ఉండాలో విద్యార్థిగానే తన రెజ్యూమ్‌లో రాసుకున్న తీరు ఆకట్టుకుంటోంది. 


లింక్డ్‌ఇన్ యూజర్స్‌ స్పందిస్తూ... అది చాలా శక్తిమంతమైన రెజ్యూమ్‌గా అభిప్రాయపడ్డారు.  ట్రాఫిక్ ఫ్లో, షెడ్యూలింగ్‌కి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్‌లు చూస్తే.. నేడు చాలా మంది ఆ సమస్యను ఎదుర్కొలేకపోతున్నారు. "


ఇరవై ఏళ్ల వయసులో ఐదు ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకోవడం... అందులో హార్వార్డ్ యూనివర్శిటీలో..  కోలాబ్‌ బేస్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ డిజైన్‌ చేయడం సామాన్యమైన విషయం కాదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.