బిహార్‌లోని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. మంగళవారం నీతీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు కేబినెట్ సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్.సిద్దార్థ్ వెల్లడించారు.


కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సర్వీస్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బిహార్ వాసులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకొనేవారు. అయితే, తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదని సిద్ధార్థ్ తెలిపారు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులు ఎవరైనా బిహార్‌లోని 1.78లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మే 2న బిహార్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఉద్యోగాల్లో 85,477 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉండగా.. 1,745 మాధ్యమిక, 90,804 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు. 


ALSO READ:


స్టాఫ్‌నర్స్‌ అభ్యర్థులకు అందుబాటులో మాక్‌టెస్ట్, ఇలా ప్రాక్టీస్ చేయండి!
తెలంగాణలో రాష్ట్రంలో స్టాఫ్‌నర్స్‌ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) అవకాశం కల్పించింది. మొదటిసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అభ్యర్థుల అవగాహన కోసం ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్ రాయవచ్చని తెలిపింది. రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని ఆగస్టు 2న నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. 
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


పెరిగిన స్టాఫ్ నర్స్ పోస్టులు, 7 వేలకి చేరిన ఖాళీల సంఖ్య, కొత్త నోటిఫికేషన్ నట్లేనా?
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో మరో 1,827 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనివే. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ జూన్ 23న ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ చేయనుంది. ఇప్పటికే 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు నిరుడు డిసెంబరు 30 మెడికల్‌ బోర్డ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందుకు సంబంధించి రాత పరీక్ష ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించబోతున్నారు. ఈ లోగానే మరో 1,827 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial