Bharat Electronics Limited Recruitment 2023: ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), ఘజియాబాద్ యూనిట్- తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 52 ట్రైనీ ఇంజినీర్ (Trainee Engineer), ప్రాజెక్ట్ ఇంజినీర్ (Project Engineer), ప్రాజెక్ట్ ఆఫీసర్ (Project Officer) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఖాళీల వివరాలు..
➥ ట్రైనీ ఇంజినీర్-I: 20 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-10, ఓసీసీ-05, ఈడబ్ల్యూఎస్-01, ఎస్సీ-03, ఎస్టీ-01.
అర్హత: 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఇంజినీరింగ్ డిగ్రీ) లేదా కంప్యూటర్ సైన్స్‌లో తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పాస్ మార్కులుంటే సరిపోతుంది.
అనుభవం: ఫ్రెషర్స్/సి++, జావా, ఆల్‌గారిథం డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్.
వయోపరిమితి: 01.06.2023 నాటికి 28 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్-I: 30 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-14, ఓసీసీ-08, ఈడబ్ల్యూఎస్-02, ఎస్సీ-04, ఎస్టీ-02.
అర్హత: 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఇంజినీరింగ్ డిగ్రీ) లేదా కంప్యూటర్ సైన్స్‌లో తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పాస్ మార్కులుంటే సరిపోతుంది.
అనుభవం: సి++, జావా, ఆల్‌గారిథం డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్, పైథాన్ అంశాల్లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2023 నాటికి 32 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ ప్రాజెక్ట్ ఆఫీసర్-I (హెచ్‌ఆర్): 01 పోస్టు
పోస్టుల కేటాయింపు: యూఆర్-01.
అర్హత: 55 శాతం మార్కులతో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిగ్రీ/పీజీ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పాస్ మార్కులుంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2023 నాటికి 32 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్-I (మెటీరియల్ మేనేజ్‌మెంట్): 01 పోస్టు
పోస్టుల కేటాయింపు: యూఆర్-01.
అర్హత: 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్).
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2023 నాటికి 32 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.177, ప్రాజెక్ట్ ఇంజినీర్/ఆఫీసర్ పోస్టులకు రూ.472 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కులు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 85 శాతం మార్కులు రాతపరీక్షకు, 15 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారిలో 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
జీతం: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు మొదటి సంవత్సరం రూ.30,000; రెండో సంవత్సరం రూ.35,000; మూడో సంవత్సరం రూ.40,000 ఇస్తారు. ఇక ప్రాజెక్ట్ ఇంజినీర్/ఆఫీసర్ పోస్టులకు మొదటి సంవత్సరం రూ.40,000; రెండో సంవత్సరం రూ.45,000; మూడో సంవత్సరం రూ.50,000; నాలుగో సంవత్సరం రూ.55,000 ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.11.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.12.2023.
ALSO READ:
➥ 26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - అర్హతలు, పూర్తి వివరాలివే
➥ 'టెన్త్' అర్హతతో కేంద్రంలో కానిస్టేబుల్ కొలువులు - 75,768 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల