Naga Panchami Serial Today December 1st Episode


కరాళి గెటప్ మార్చి మోక్ష ఇంటి దగ్గర అడుగు పెడుతుంది. వస్తూ వస్తూనే ఓ చెట్టుపై తన చేతి రక్తంతో క్రీం అని రాసి నా రక్తం ఈ ఇంటి వినాశనానికి అంకురార్పణ అని అంటుంది. దీన్ని అంతటిని సుబ్బు తన దివ్య దృష్టితో చూస్తాడు. ఇక కరాళి మోక్ష ఇళ్లు ఎప్పుడు దగ దగ మండిపోతూ ఉండాలని.. ఆ మంట్లో వాళ్లంతా కాలి బూడిద అవ్వాలని అంటుంది. దీంతో సుబ్బు తన దివ్య దృష్టితో చెట్టు మీద రాసిన రాతలను చెరిపేస్తాడు. అంతే కాకుండా కరాళి అడుగు ముందుకు వేయలేకుండా అయిపోతుంది. దీంతో కరాళి షాక్ అయిపోతుంది. మహాంకాళికి మొక్కు కుంటే అప్పుడు కదులుతుంది. 


వైదేహి: ఎవరు నువ్వు
కరాళి: వైదేహి అంటే మీరే కదా 
వైదేహి: అవును అయినా నేనే వైదేహి అని నీకు ఎలా తెలుసు
కరాళి: మా అన్నయ్య గారు చెప్పారు ఆమెను చూడగానే లక్ష్మీ కల ఉట్టిపడుతుంది అని. ఈ ఇంటికి మహారాణి అని కూడా చెప్పారు. నేను నంబూద్రీ గారి చెల్లెలిని. నాపేరు మోహిని. నన్ను మా అన్నయ్య గారు పంపించారు. అక్కడ ఆయన నిన్ను బాగా చూసుకుంటారని చెప్పారు. 
వైదేహి: నంబూద్రీ గారికి మా మీద అభిమానం గౌరవం ఎక్కువ. అందుకు అలా చెప్పిఉంటారు. చాలా సంతోషం అమ్మా ఇంతకీ నంబూద్రీ గారు ఎక్కడ ఉన్నారు. చాలా రోజులుగా ఫోన్ చేస్తున్న కలవడం లేదు.
మోహిని: హిమాలయాలకు వెళ్లారు. ఆరు నెలల తర్వాత వస్తారు. అంత వరకు నన్ను మీ దగ్గరే ఉండమన్నారు.
వైదేహి: మా గురువుగారి చెల్లెలు అంటే మాటలా.. నువ్వు ఎన్ని రోజులు అయినా ఇక్కడ ఉండొచ్చు. అయితే ఒక్క మాట అమ్మ నా కొడుకు మోక్షకు మీ అన్న నంబూద్రీ గారు అంటే ఇష్టం ఉండదు. అందుకని నిన్ను నా ఫ్రెండ్ కూతురని చెప్తా సరేనా అమ్మా.. లోపలికి రా.


ఇక కరాళి(మోహిని) లోపలికి వస్తేంటే ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడి కాయ కింద పడిపోతుంది. అంతేకాకుండా అది కుళ్లి పోయి ఉంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు అంతా బయటకు వస్తారు. 


జ్వాలా: నెల రోజులు ఉంచమన్న గుమ్మడి కాయ నాలుగు రోజులకే పడిపోయింది. 
చిత్ర: అవును అక్క చెడిపోయిన గుమ్మడికాయ తెచ్చి కట్టారు. చూడు విత్తనాలు అన్ని పాడైపోయి ఉన్నాయి.  
జ్వాలా: ఈ సారి ఆ పంతులు వస్తాడు కదా అప్పుడు చెప్దాం వాడి సంగతి
శబరి: నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకుండి. గుమ్మడికాయ రంగు మారింది అంటే దిష్టి పట్టిందని అర్థం. 
వైదేహి: తను నా ఫ్రెండ్ కూతురు. పేరు మోహిని. (పంచమి తనని కరాళి అని గుర్తు పట్టి షాక్ అవుతుంది.)
మోక్షతండ్రి: ఏ ఫ్రెండ్ కూతురు వైదేహి. వస్తున్నట్లు చెప్పనే లేదు
మోహిని: నేను వస్తున్నా అని ఆంటీకి కూడా తెలీదు అంకుల్. సడెన్‌గా వచ్చాను. మాది కేరళ. నాకు అన్ని భాషలు వచ్చు. నేను విష కీటకాలు అంటే పాములు వంటి వాటి విషంపై ప్రయోగాలు చేస్తూ ఉంటాను. 
చిత్ర: నవ్వుతూ.. కరెక్ట్‌గా రావాల్సిన చోటుకే వచ్చావు. ఒకరి సొంత ఇళ్లు పాముల పుట్టు ఇక ఆమె భర్త పాముల మీద రీసెర్చ్ చేస్తుంటారు. మీ ముగ్గురు ఒక చోట కలిస్తే పండగే పండగే.
మోక్ష: ఇంతకీ మీరు ఏ పాముల మీద ప్రయోగాలు చేస్తారు. 
మోహిని: చెప్తాను. కానీ మీరు నన్ను మోహిని అని పిలిస్తే  చాలు..  నేనే అన్ని రకాల పాముల విషాల మీద ప్రయోగాలు జరిపి ఆరు పసరులతో ఆ విషాలకు విరుగుడు కనుక్కున్నాను. 
మోక్ష: మీరు నా రీసెర్చ్‌కు ఉపయోగపడతారు.
వైదేహి: ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. ఆ విషయాలు తర్వాత చూసుకోవచ్చు లోపలికి పదండి
చిత్ర: అక్క దీని వాలకం చూస్తుంటే మన మొగుళ్ల మీద ఒక కన్ను వేసి ఉండాలి అక్కా


మరోవైపు పంచమి తల్లి అడవిలో నాగ సాధువును కలవడానికి వస్తుంది. గురువుగారి శిష్యుడితో మాట్లాడుతుంది. ఆయన నాగసాధువు రావడానికి రెండు రోజులు పడుతుంది అంటారు. దీంతో అప్పటికే పౌర్ణమి వచ్చేస్తుందని బాధ పడుతుంది. ఇంతో శిష్యుడు ఏమైనా అత్యవసరమా అమ్మా అని అడుగుతారు. అందుకు ఆమె నా కూతురు పంచమి గురించి అని చెప్తుంది. నీ కూతురు పంచమి కోసం నా తెలుసు అమ్మ. ఆమె గురించి మాకు గురువు గారు చెప్తారమ్మా అని అంటారు. పౌర్ణమి రోజు తన కూతురు పాములా మారి తన అల్లుడిని కాటేయనుందని అందుకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పమంటుంది. దీంతో ఆయన తన కూతురు అల్లుడితో మహా మృత్యుంజయ యాగం చేయమని చెప్తారు. 


మరోవైపు పంచమి ఆరుబయట కార్తీక దీపాలు వెలిగిస్తుంది. మరోవైపు మోహిని మోక్షతో పాముల రీసెర్చ్ గురించి మాట్లాడుతూ.. కళ్లతో మోక్షను తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మోక్ష ఆమె మాయలో ఉంటాడు.  
మోహిని: మీకు ఇష్టరూపజాతి నాగుల గురించి ఏం తెలుసు
మోక్ష: నేను ఇష్టరూపజాతి నాగులను ప్రత్యక్షంగా చూశాను. నా భార్య కూడా అదే జాతి నాగు. 
మోహిని: అవునా.. ఆ నాగ విషం చాలా పవర్ ఫుల్ అని నీకు తెలుసా
మోక్ష: తెలుసు.. ప్రతి పౌర్ణమికి నా భార్య పాముగా మారి నన్ను కాటేయడానికి ప్రయత్నిస్తుంది. ఏదో ఒక పౌర్ణమికి నేను ఆ పాము కాటుకి బలికాక తప్పదు. ఎక్కువ కాలం తప్పించుకోలేను.
మోహిని: నీకు ఆ భయం లేదు మోక్ష. వచ్చే పౌర్ణమికి నీ భార్య పాముగా మారిన తర్వాత ఆ పాము నుంచి విషాన్ని సంపాదించగలిగితే నేను ఆ విషానికి విరుగుడు కనిపెడతాను. 
మోక్ష: నిజంగా కనిపెట్టగలవా మోహిని
మోహిని: ప్రామిస్ మోక్ష.. ఇంత అందమైన మీరు పాము కాటుకి బలికాకూడదు. నేను కానివ్వను. నేను నీకు నచ్చానా మోక్ష
మోక్ష: మాయలో ఉన్న మోక్ష.. నచ్చావు మోహిని అని అంటాడు. మరోవైపు పంచమి, సుబ్బు వాళ్లు ఉన్న గదికి వస్తుంటారు. మోహిని, మోక్షని దగ్గరగా తీసుకోవడం పంచమి, సుబ్బు చూసి షాక్ అవుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply


https://bit.ly/ekbabplbantel