BEL Recruitment 2024: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 32 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియ‌న్, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీకాం, బీబీఎం ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 11 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు, రాతపరీక్ష తదితరల ఆధారంగా తుది ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత.. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టులకు నెలకు రూ.24,500- రూ.90,000 వరకు జీతంగా ఇస్తారు. ఇక టెక్నీషియ‌న్, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,500- రూ.82,000 వరకు జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనంగా అందుతాయి.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 32  


➤ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ: 12 పోస్టులు


విభాగం: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్.


అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి  కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీల, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


➤ టెక్నీషియ‌న్ ‘సీ’ : 17 పోస్టులు


విభాగం: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రికల్.


అర్హత: 60 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో ఐటీఐ, ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ (లేదా) పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో 3 సంవత్సరాల నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీల, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


➤ జూనియ‌ర్ అసిస్టెంట్: 03 పోస్టులు


విభాగం: బీకామ్/బీబీఎం. 


అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో  బీకామ్ /బీబీఎం(మూడేళ్ల కోర్సు) డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీల, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.  


వయోపరిమితి: 01.06.2024 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంది.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపికచేస్తారు.


రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కలకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలు రెండు విభాగాలు(పార్ట్-1, పార్ట్-2) ఉంటాయి. పార్ట్-1లో 50 మార్కులకు జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్, కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక పార్ట్-2లో టెక్నికల్/ట్రేడ్ నాలెడ్జ్ నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో కనీస అర్హత మార్కులను ఒక్కో విభాగానికి 35 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  30 శాతం మార్కులు వస్తే చాలు.


జీతం: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుకు రూ.24,500- రూ.90,000. టెక్నీషియ‌న్, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుకు రూ.21,500- రూ.82,000 ఇస్తారు.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.07.2024.


Notification


Online Application


Website


ALSO READ:


➥ ఇండియన్ కోస్ట్‌గార్డులో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...