BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ ఇంజినీర్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.1.4 లక్షల వరకు జీతం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

BEL Recruitment: మచిలిపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన డిప్యూటీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఏఎంఐఈ, జీఐఈటీఈ, బీఎస్సీ(4 సంవత్సరాలు) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేపడతారు. 

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 20

రిజర్వేషన్: యూఆర్- 09, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01. 

⏩ డిప్యూటీ ఇంజినీర్(ఎలక్ట్రానిక్స్‌)(ఇ-II) గ్రేడ్‌: 08 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ బీఎస్సీ ఇంజినీరింగ్ (4 సంవత్సరాల కోర్సు) (ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ / కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్) ఉత్తీర్ణత ఉండాలి. జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ అండ్ ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.02.2025 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 28 సంవత్సరాలు; ఒబీసీలకు 31 సంవత్సరాలు; ఎస్సీ/ ఎస్టీ వారికి 33 సంవత్సరాలు ఉండాలి.   

⏩ డిప్యూటీ ఇంజినీర్‌(మెకానికల్‌): 12 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ బీఎస్సీ ఇంజినీరింగ్ (4 సంవత్సరాల కోర్సు) (మెకానికల్) ఉత్తీర్ణత ఉండాలి.జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ అండ్ ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.02.2025 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 28 సంవత్సరాలు; ఒబీసీలకు 31 సంవత్సరాలు; ఎస్సీ/ ఎస్టీ వారికి 33 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్ I & పార్ట్ II రెండు విభాగాలు ఉంటాయి. 
పార్ట్ I: జనరల్ అవేర్‌నెస్: 15 మార్కులు - 15 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ మెంటాలిబిలిటీ అండ్ ఆప్టిట్యూడ్ టు లాజికల్ రీజనింగ్, అనలిటికల్, కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. 
పార్ట్ II: టెక్నికల్/ట్రేడ్ ఆప్టిట్యూడ్: 70 మార్కులు – 70 ప్రశ్నలు ఉంటాయి. టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ సంబంధిత డిగ్రీ నుంచి నిర్దిష్ట ప్రశ్నలు అడుగుతారు. 

జీతం: నెలకు రూ.40,000-రూ.1,40,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2025.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు..

➥ బర్త్ సర్టిఫికేట్ లేదా పదోతరగతి సర్టిఫికేట్(పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)

➥ స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో

➥ అన్ని సర్టిఫికెట్లు (మెట్రిక్యులేషన్ / పదవ తరగతి / పీయూసీ / ఇంటర్/ డిగ్రీ) 

➥ అన్ని సెమిస్టర్ మార్కు షీట్లు - బీఈ/బీటెక్/ఏఎంఐఈ/జీఐఈటీఈ/బీఎస్సీ(ఇంజినీరింగ్)

➥ క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికెట్

➥ యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ధృవీకరించబడిన సీజీపీఏ /డీజీపీఏ /ఓజీపీఏ లేదా లెటర్ గ్రేడ్ టు పర్సంటేజ్ మార్కులు & అవార్డెడ్ క్లాసు మార్పిడి కోసం కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్

➥ నిర్ణీత ఫార్మాట్‌లో కాస్ట్ సర్టిఫికేట్(ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్)

➥ దివ్యాంగులకు డిజబిలిటి సర్టిఫికేట్

➥ ప్రభుత్వ / పాక్షిక ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం చేస్తుంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్బ


Notification

Online Application

OBC Certificate Format

EWS Certificate FormatEWS Certificate Format

SC/ST Certificate Format

PwBD Certificate Format

online payment of application fee
Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola