భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ & బీకామ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సదరన్‌ రీజియన్‌ (తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి) ప్రాంతానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీకాం ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 10వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది.  


వివరాలు..


మొత్తం ఖాళీలు: 81


⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 63 పోస్టులు


➛ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 28 పోస్టులు


➛ మెకానికల్ ఇంజినీరింగ్: 25 పోస్టులు


➛ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 05 పోస్టులు


➛ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 03 పోస్టులు


➛ సివిల్ ఇంజినీరింగ్: 02 పోస్టులు


⏩ టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీస్: 10 పోస్టులు


➛ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 05 పోస్టులు


➛ మెకానికల్ ఇంజినీరింగ్: 05 పోస్టులు


⏩ బీకామ్ అప్రెంటిస్: 08 పోస్టులు


అర్హత: డిప్లొమా/బీఈ/బీటెక్(ఇంజినీరింగ్)/బీకామ్ అభ్యర్థులు 2020,2021,2022 & 2023లో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్, ఓబీసీ & ఈడబ్ల్యూఎప్ అభ్యర్థులు కనీసం 60% & అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్/డిప్లొమాలో కనీస శాతం 50% & అంతకంటే ఎక్కువ ఉండాలి. బీకామ్‌లో కనీస 50% & అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇప్పటికే NATS లేదా NAPS, ఏదైనా ఇతర సంస్థలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందిన లేదా పొందుతున్న అభ్యర్థులు అనర్హులు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అర్హులు కాదు.


వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.


శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం


ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.17,500; టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.12,500; బీకాం అప్రెంటిస్‌లకు రూ.10,500.


వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ& సమయం: 10.01.2024(ఉదయం 10.00 గంటలు).


ఇంటర్వ్యూకి తీసుకురావల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్లు..


➥ పదోతరగతి లేదా తత్సమనా విద్యార్హతల మార్కుల మెమో


➥ ఇంటర్ మార్కుల మెమో


➥ కన్సాలిడేటెట్ మార్కుల షీట్ లేదా అన్ని సెమిస్టర్ల మార్కుల మెమోలు


➥ డిగ్రీ/ డిప్లొమా సర్టిఫికేట్లు


➥ ఆధార్ కార్డు


➥ SC/ST/OBC/EWS అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్


➥ సీజీపీఏ కన్వర్షన్ సర్టిఫికేట్


వాక్‌ఇన్ వేదిక: 
BHARAT ELECTRONICS LIMITED
NANDAMBAKKAM
CHENNAI - 600 089.

Notification & Application 


Website


ALSO READ:


నేషనల్‌ ఇన్స్యూరెన్స్ కంపెనీలో 274 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి
నేషనల్‌ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ (ఐఎన్‌సీ) అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 274 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 2 నుంచి 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...