పుణె ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  


వివరాలు..


స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడ్-2, 3: 225 పోస్టులు


➥ ఎకనామిస్ట్:  02


➥ సెక్యూరిటీ ఆఫీసర్: 03


➥ సివిల్ ఇంజినీర్: 10


➥ లా ఆఫీసర్: 03


➥ ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్: 04


➥ డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్: 50


➥ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 02


➥ ఎలక్ట్రికల్ ఇంజినీర్: 15  


➥ రాజభాష ఆఫీసర్: 10   


➥ హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్: 05  


➥ డేటా అనలిటిక్స్: 03  


➥ ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్: 11  


➥ డిజిటల్ బ్యాంకింగ్, మేనేజర్: 05  


➥ ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్: 10


➥ మొబైల్ యాప్ డెవలపర్-: 10 


➥ డాట్‌నెట్ డెవలపర్: 10 


➥ జావా డెవలపర్: 10  


➥ క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్: 05 


➥ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: 05  


➥ యూనిక్స్/ లైనెక్స్‌ అడ్మినిస్ట్రేటర్: 20  


➥ నెట్‌వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్: 06   


➥ విండోస్ అడ్మినిస్ట్రేటర్: 04   


➥ వీఎంవేర్/ వర్చువలైజేషన్ అడ్మినిస్ట్రేటర్: 01 


➥ మెయిల్ అడ్మినిస్ట్రేటర్: 02  


➥ ప్రొడక్షన్‌ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ‌ఫర్‌ ఈఎఫ్‌టీ స్విచ్: 04


➥ ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ యూపీఐ స్విచ్: 08  


➥ విండోస్ డెస్క్‌టాప్ అడ్మినిస్ట్రేటర్: 02  


➥ డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్: 04  


అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
 
వయోపరిమితి: పోస్టును అనుసరించి కనిష్ఠంగా 25, గరిష్ఠంగా 35, 38 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 


ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  
 
జీత భత్యాలు: నెలకు స్కేల్ 3 పోస్టులకు రూ.63840-రూ.78230. స్కేల్ 2 పోస్టులకు రూ.48170-రూ.69810.  
 
దరఖాస్తు రుసుము: రూ.1180(ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.118).  


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23.01.2023.  


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.02.2023.


Notification


Online Application


Website



Also Read:


'టెన్త్' అర్హతతో కానిస్టేబుల్ పోస్టులు, 451 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి - దరఖాస్తు ప్రారంభం!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్న పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమైంది. అభ్యర్థుల ఫిబ్రవరి 22 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఇండియ‌న్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు జూన్-2023 ద్వారా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...