డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రిసెర్చ్ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా జేటీఓ, ఏఎస్ఓ, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పదవతరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత గల అభ్యర్ధులు అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 17 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.


పోస్టుల వివరాలు..


మొత్తం పోస్టులు: 321    


1) జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్(జేటీఓ): 09 
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.     
వయోపరిమితి: 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.     
జీతం: రూ.35,400. 


2) అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్(ఏఎస్ఓ): 38
అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.     
జీతం: రూ.35,400. 


3) సెక్యూరిటీ గార్డు: 274
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.     
జీతం: రూ.18,000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.     


ఎంపిక ప్రక్రియ: పోస్టులను అనుసరించి లెవల్ -1 (రాత పరీక్ష), లెవల్ -2 (డిస్క్రిప్టివ్ రాతపరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.     


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.     


ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.11.2022.    
* ఏఎస్ఓ -ఎ, సెక్యూరిటీ గార్డు పోస్టులకు ఫిజికల్ టెస్ట్ తేదీలు: డిసెంబర్, 2022.   
* జేటీఓ (లెవల్ -1), సెక్యూరిటీ గార్డు పోస్టుల రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): జనవరి, 2023  
* జేటీఓ (లెవల్ - 2), ఏఎస్ఓ -ఎ డిస్క్రిప్టివ్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి, 2023.    


Notification 


Online Application 


Website 


 


:: Also Read ::


ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
చెన్నైలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజినల్ హెడ్ క్వార్టర్స్ (EAST) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా స్టోర్ కీపర్ గ్రేడ్-II, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్), ఎలక్ట్రికల్ ఫిట్టర్/ఎలక్ట్రీషియన్(స్కిల్డ్), మెషినిస్ట్(స్కిల్డ్), టర్నర్/మెక్ టర్నర్(స్కిల్డ్), కార్పెంటర్(స్కిల్డ్), మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్/మెకానిక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫిట్టర్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబరు 7 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ & కేపబిలిటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...