AOC Centre Secunderabad - Army Recruitment Rally: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఏఓసీ సెంటర్ థాపర్ స్టేడియంలో హెడ్‌క్వార్టర్స్ కోటా కింద డిసెంబరు 29 నుంచి 2024 మార్చి 10 వరకు అగ్నివీరుల భర్తీ కోసం సైనిక నియామక ర్యాలీ నిర్వహించనున్నట్లు డిఫెన్స్‌ విభాగం అధికారులు  నవంబరు 15న ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్‌ జనరల్ డ్యూటీ(జీడీ), అగ్నివీర్‌ టెక్‌, అగ్నివీర్‌ అడ్మిన్‌/ అసిస్టెంట్‌/స్టోర్ కీపర్ టెక్నికల్(ఎస్‌కేటీ)/ అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు.


ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికేట్లు, స్పోర్ట్స్ సర్టిఫికేట్లతోపాటు.. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. పూర్తి వివరాల కోసం ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్‌క్వార్టర్స్‌లో సంప్రదించాలని లేదా వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే tuskercrc-2021@gov.inకు మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.


వివరాలు..


* అగ్నివీర్ ఆర్మీ నియామక ర్యాలీ


అర్హతలు..


➥ అగ్నివీర్ జీడీ (జనరల్ డ్యూటీ)


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


అర్హత: కనీసం 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జె్క్టులో 33 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ (లైట్ మోటార్ వెహికిల్) ఉన్నవారికి ప్రాధాన్యం.


➥ అగ్నివీర్ టెక్ (టెక్నాలజీ)


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ)లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ప్రతి సబ్జె్క్టులో 44 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా డిప్లొమా (రెండేళ్లు/మూడేళ్ల) కోర్సు చేసి ఉండాలి.


➥ అగ్నివీర్ అడ్మిన్ అసిస్టెంట్/ స్టోర్ కీపర్ టెక్నికల్ (ఏవోసీ వార్డు)


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ)లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మ్యాథ్స్/అకౌంట్స్/బుక్ కీపింగ్ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. 


➥ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ 10వ తరగతి స్థాయి (ఆర్టీసన్ మిస్క్ వర్క్స్, చెఫ్, స్టీవార్డ్)


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


➥ అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ 8వ తరగతి స్థాయి (హౌజ్ కీపర్)


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


➥ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ (ఓపెన్ కేటగిరీ)


వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.


అర్హత: జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, డైవింగ్, వెయిట్‌లిఫ్టింగ్ లాంటి క్రీడాంశాల్లో ప్రతిభ ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్లు తప్పనిసరి. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ కింద నిర్వహించే స్పోర్ట్స్ ట్రయల్ కోసం డిసెంబర్ 29, 2023న ఉదయం 6 గంటలకు AOC సెంటర్‌లోని థాపర్ స్టేడియంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ క్రీడాకారులు సీనియర్/జూనియర్ జాతీయ స్థాయిలో తమ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినవారు, వ్యక్తిగత ఈవెంట్‌లలో ఏదైనా పతకం సాధించినవారు లేదా ట్రాక్ మరియు ఫీల్డ్ ఈవెంట్‌లతో సహా అథ్లెటిక్స్ రంగాలలో టీమ్ ఈవెంట్‌లో 8వ స్థానం వరకు చేరుకున్న అభ్యర్థులు, స్విమ్మింగ్, డైవింగ్, వెయిట్ లిఫ్టింగ్ తదితర విభాగాలకు చెందినవారు సంబంధిత సర్టిఫికేట్‌లతో ర్యాలీకి హాజరుకావచ్చు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రిక్రూమెంట్ ర్యాలీ ఆధారంగా. ఫిజికల్ ఈవెంట్లు, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ర్యాలీ తేదీలు: 29.12.2023 నుంచి 10.03.2024 వరకు.


➥ స్పోర్ట్స్ ట్రయల్: 29.12.2023.


అగ్నివీర్ ర్యాలీ వేదిక: Thapar Stadium, Army Ordnance Corps (AOC) Centre, Secunderabad


హెడ్‌క్వార్టర్స్ ఏవోసీ సెంటర్: East Marredpally, Trimulgherry, Secunderabad (TS) 500015.


ఈమెయిల్: tuskercrc-2021@gov.in


Website