ఏపీలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(ఏపీటెట్‌-2022) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థుల మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 5,25,789 మంది అభ్యర్థులు ఏపీటెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 4,07,329 మంది పరీక్షకు హాజరయ్యారు.  అభ్యర్థుల మార్కులు కేటగిరీల ఆధారంగా నార్మలైజేషన్ తర్వాత ఫలితాలను విడుదల చేశారు. ఏపీటెట్ ఫలితాల్లో మొత్తం 2,39,102 మంది అభ్యర్థులు (58.07 శాతం) అర్హత సాధించారు.



ఏపీటెట్-2022 (ఆగస్టు) పరీక్షలను ఆగస్టు 6 నుంచి 21 వరకు నిర్వహించిన ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షల కోసం మొత్తం 150  పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏపీతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా పరీక్ష నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్‌ 14 విడుదలకావాల్సి ఉండగా. చివరకు సెప్టెంబరు 30న విడుదల కానున్నాయి.



ఏపీటెట్-2022 ప్రిలిమినరీ కీని ఆగస్టు 31న విడుదల చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం సెప్టెంబరు 14న ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు. ఫైనల్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.



APTET 2022 Result కోసం క్లిక్ చేయండి..


Website




Also Read:


APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!

ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!

ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!

ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...