SI Main Exam Key: ఎస్ఐ తుది రాతపరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఫైనల్ పరీక్షలకు సంబంధించి పేపర్‌-3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రిలిమినరీ కీలను ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. కీపై అభ్యంతరాలు స్వీకరించనుంది.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల తుది రాతపరీక్షలు అక్టోబరు 15న ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. అక్టోబర్‌ 14 నిర్వహించిన పేపర్‌-1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది హాజరయ్యారు. మొత్తం 608 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇక రెండో రోజైన అక్టోబర్‌ 15 జరిగిన పేపర్‌-3 (అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ) పరీక్షకు 30569 మంది, పేపర్‌-4(జనరల్‌ స్టడీస్‌) పరీక్షకు 30560 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Continues below advertisement

పేపర్‌-3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రిలిమినరీ కీలను ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్‌ 18న సాయంంత్రం 5.00 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్‌లో మెయిల్‌ ద్వారా తెలియజేయాలి. అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెలువడనున్నాయి.

Press Note dated 15-10-2023 regarding Preliminary Keys of SCT SI / RSI Final Written Examination 

New

Paper-III Preliminary Key 

Paper-III - Set-A Question Paper Booklet 

Paper-III - Set-B Question Paper Booklet 

Paper-III - Set-C Question Paper Booklet 

Paper-III - Set-D Question Paper Booklet 

Paper-IV Preliminaey Key 

Paper-IV - Set-A Question Paper Booklet 

Paper-IV - Set-B Question Paper Booklet 

Paper-IV - Set-C Question Paper Booklet 

Paper-IV - Set-D Question Paper Booklet 


రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన 31,193 మంది అభ్యర్థులకు మెయిన్ పరీక్షలు నిర్వహించారు.

ALSO READ:

ఇండియన్ ఆర్మీలో 'టెక్నికల్ ఎంట్రీ స్కీమ్' దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో జులై-2024లో ప్రారంభమయ్యే 51వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్)-2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో  677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola