ఏపీ లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఉన్నత విద్యామండలి జులై 15న అన్ని యూనివర్సిటీల పాలకవర్గ (ఈసీ) సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి తెలిపిన నేపథ్యంలో.. వీటి నియామకాలకు పాటించాల్సిన విధానంపై పాలకవర్గంలో చర్చించారు. ఇటీవల ఉన్నత విద్యామండలి వర్సిటీల్లో టీచింగ్ పోస్టుల హేతుబద్ధీకరణ నిర్వహించింది.
యూనివర్సిటీల్లో కొన్ని పోస్టులు అవసరమున్నట్లు గుర్తించారు. వర్సిటీల్లో ఈసారి ఆర్ట్స్ సబ్జెక్టుల పోస్టులు తగ్గిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు చేరడం లేదని కొన్నిచోట్ల ఆర్ట్స్ కోర్సులను మూసివేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు విశ్వవిద్యాలయాలు.. ఏపీపీఎస్సీతో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. సమన్వయ బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించేందుకు ఈసీలో తీర్మానించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఆదికవి నన్నయ, కృష్ణా, విక్రమసింహాపురి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు రెక్టార్లు లేనందున ఇక్కడ ఈసీ తీర్మానాలకు కోరం సరిపోని పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఇక్కడా కోరం సమస్య ఏర్పడింది.
➥ స్క్రీనింగ్ పరీక్షలో ఓసీ, ఓబీసీలకు 40%, ఎస్సీ, ఎస్టీలకు 35% మార్కులు రావాలి. పరీక్షతోపాటు అకడమిక్ అర్హతలకు వెయిటేజీ ఉంటుంది. ఒక్కో పోస్టుకు నలుగుర్ని మౌఖిక పరీక్షలకు పిలిచే అవకాశం ఉంది.
➥ అకడమిక్ సంబంధించి డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇస్తారు. పీహెచ్‌డీ, జేఆర్‌ఎఫ్‌తో నెట్, స్లెట్, నెట్‌కు అదనంగా వెయిటేజీ ఉంటుంది.
➥ అకడమిక్‌కు 80, పరిశోధనకు 10, బోధన అనుభవానికి 10 చొప్పున మొత్తం 100 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష మార్కులతోపాటు అకడమిక్ మార్కులను కలిపి మౌఖిక పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
➥ మౌఖిక పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పోస్టుకు నలుగురి చొప్పున పిలిచిన తర్వాత నిర్వహించే మౌఖిక పరీక్ష అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. మౌఖిక పరీక్షకు ఎక్కువ మార్కులు కేటాయించినందున ఇది కీలకంగా మారనుంది.
రిజర్వేషన్లు ఇలా..
గతంలో వర్సిటీల్లో నియామకాలకు ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల వారీగా రిజర్వేషన్‌ను అమలు చేయగా.. ఇప్పుడు వర్సిటీ యూనిట్‌గా రిజర్వేషన్ అమలు చేయనున్నారు. రిజర్వేషన్ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. కొత్తగా ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల రిజర్వేషన్‌తోపాటు మహిళ రిజర్వేషన్‌లో మార్పు రానుంది. 200 రోస్టర్ పాయింట్ల ప్రకారం నిర్వహించనున్నారు.
ALSO READ:
TSPSC: 'గ్రూప్-2' పరీక్ష ఓఎంఆర్ విధానంలోనే, టీఎస్‌పీఎస్సీ ప్రకటన!
గ్రూప్-2 నియామక పరీక్షను ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలోనే నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) జూన్ 15న వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 29, 30 తేదీల్లో రెండు సెషన్లలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కమిషన్ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్‌పీఎస్సీ అధికారులు సమావేశాలు నిర్వహించి చర్చించారు. గ్రూప్-2 పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆగస్టు 29, 30 తేదీల్లో ఆ రెండు రోజులు సర్కారు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial