ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 1 లోపు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


Online Application



పోస్టుల వివరాలు..



* నాన్-గెజిటెడ్ పోస్టులు



పోస్టుల సంఖ్య: 45 పోస్టులు (క్యారీడ్ ఫార్వర్డ్-26, కొత్త పోస్టులు-19)



1) శాంపిల్ టేకర్: 12 పోస్టులు


విభాగం: ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్& ఫుడ్ సబ్ సర్వీస్.


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. ప్రభుత్వం జారీచేసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.35,570-రూ.1,09,910.



2) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 03 పోస్టులు


విభాగం: ఏపీ జువైనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్. 


అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సోషల్ వర్క్/సైకాలజీ)తోపాటు ఎంఏ(సోషల్ వర్క్/సైకాలజీ) లేదా ఏదైనా డిగ్రీతోపాటు ఎంఏ (క్రిమినాలజీ/కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్) ఉండాలి.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 25- 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.44,570-రూ.1,27,480.



3) టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్): 04  పోస్టులు


విభాగం: ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్.


అర్హత: జియోఫిజిక్స్‌లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ ఉండాలి.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.54,060 - రూ.1,40,540.



4) అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ఫిషరీస్): 03 పోస్టులు


విభాగం: ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్.


అర్హత: పీజీడిప్లొమా (ఫిషరీస్ టెక్నాలజీ)/ పాలిటెక్నిక్ డిప్లొమా (ఫిషరీస్ టెక్నాలజీ)/ సర్టిఫికేట్ (భారత ప్రభుత్వ ఇన్‌ల్యాండ్ లేదా మెరైన్ ఫిషరీస్ కోర్సు)/ బీఎస్సీ డిగ్రీ (ఫిషరీస్/ఎఫ్‌జెడ్‌సీ)/బీఎఫ్‌ఎస్సీ డిగ్రీ ఉండాలి.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.32,670-రూ.1,01,970.


 


5) టౌన్ ప్లానింగ్ & బిల్డింగ్ ఓవర్‌సీర్: 02 పోస్టులు


విభాగం: ఏపీ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్: 02 పోస్టులు 


అర్హత: డిప్లొమా(D.C.E./L.C.E./L.A.A)/బీఆర్క్/ బీఈ(సివిల్)/బీటెక్ (సివిల్)/ బీప్లానింగ్/బీటెక్(ప్లానింగ్) ఉండాలి.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.34,580-రూ.1,07,210.


 


6) జూనియర్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు): 01 పోస్టు


విభాగం: ఏపీ ట్రాన్స్‌లేషన్ సబార్టినేట్ సర్వీస్.


అర్హత: డిప్లొమా(D.C.E./L.C.E./L.A.A) లేదా బీఈ/బీటెక్(సివిల్) లేదా బీఆర్క్/ బీప్లానింగ్ లేదా బీటెక్(ప్లానింగ్) ఉండాలి.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.37,640-రూ.1,15,500.


 


7) ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్: 08 పోస్టులు


విభాగం: ఏపీ ఇండస్ట్రియల్ సబార్టినేట్ సర్వీస్. 


అర్హత: డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ) లేదా సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉండాలి. 


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.54,060-రూ.1,40,540.


 


8) టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు


విభాగం: ఏపీ మైన్స్ & జియోలజీ సబ్ సర్వీస్.


అర్హత: డిగ్రీ (జియోలజీ) ఉండాలి. 


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.35,570-రూ.1,09,910.


 


9) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 08 పోస్టులు


విభాగం: ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్.


అర్హత: సంబంధిత విభాగాల్లో  డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ) లేదా డిప్లొమా ఉండాలి. 


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


జీతం: రూ.44,570-రూ.1,27,480.



వయోసడలింపు: నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, NCC (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.



దరఖాస్తు విధానం:
 ఆన్‌లైన్ ద్వారా.



ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.



రాతపరీక్ష విధానం:
మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1: 150 మార్కులు, పేపర్-2: 150 మార్కులు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 వంతు మేర కోత విధిస్తారు. 



పరీక్షలో అర్హత మార్కులు: జనరల్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 35 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు. 



ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2022.


ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.11.2022.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.11.2022.


NOTIFICATION


Website



:: Also Read ::


APPSC Recruitment: ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!



APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!



APPSC Recruitment: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!



APPSC AEE Recruitment: ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...