లావా యువ ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. భారత దేశ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా మనదేశంలో లాంచ్ చేసిన లేటెస్ట్ ఫోన్ ఇదే. మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. రెడ్‌మీ ఏ-సిరీస్, రియల్‌‌మీ సి-సిరీస్ ఫోన్లతో ఇది పోటీ పడనుంది.


లావా యువ ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.7,799గా నిర్ణయించారు. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లావా ఈ-స్టోర్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


లావా యువ ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పిక్సెల్ డెన్సిటీ 269 పీపీఐగా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా స్క్రీన్ ప్రొటెక్షన్ లభించనుంది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మరో రెండు సెన్సార్లు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


4జీ, బ్లూటూత్ వీ5, ఎఫ్ఎం రేడియో, వైఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, జీపీఆర్ఎస్, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 320 గంటల స్టాండ్ బై టైం, 37 గంటల టాక్ టైంను లావా యువ ప్రో అందించనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 191 గ్రాములుగా ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?