ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.



పోస్టుల వివరాలు..



* ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్



పోస్టుల సంఖ్య: 08 (క్యారీడ్ ఫార్వర్డ్-03, కొత్తవి-05)



అర్హత:
బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/ బోటనీ/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫారెస్ట్రీ/ జియోలజీ/ హార్టికల్చర్/ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ వెటర్నరీ సైన్స్/ జువాలజీ). లేదా ఇంజినీరింగ్ డిగ్రీ (అగ్రికల్చర్/కెమికల్/సివిల్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్).


వయోపరిమితి: 01/07/2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


Online Application


దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాలి. పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్ల రేషన్ కార్డు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్షల ఆధారంగా.

జీతం: రూ.48,440 –  రూ.1,37,220.



రాతపరీక్ష, సిలబస్ వివరాలు...


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.11.2022.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.12.2022. 


* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 04.12.2022. 


Notification


Website


:; ఇవీ చదవండి ::


TSPSC: ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్ష 'కీ' విడుదల, అందుబాటులో రెస్పాన్స్ షీట్లూ!
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష ప్రాథమిక కీని  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబరు 15న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ ద్వారా తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ కోసం క్లిక్ చేయండి...


నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
తెలంగాణలో  వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి 50 వేలకు పైగా పోస్టులకు ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. ఆయా పోస్టులకు  నవంబరు 20 తర్వాత వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, లెక్చరర్ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో  ఉద్యోగాలు, అటవీశాఖ ఉద్యోగాలు, గురుకుల టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...