APPSC ASO Application: అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

ASO Application: ఏపీలో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. అభ్యర్థులు మే 8 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Continues below advertisement

APPSC ASO Recruitment: ఏపీ ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ (Assistant Statistical Officer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. అభ్యర్థులు మే 8 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

Continues below advertisement

వివరాలు..

* అసిస్టెంట్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్ (Assistant Statistical Officer)

విభాగం: ఏపీ ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌.

ఖాళీల సంఖ్య: 05

పోస్టుల కేటాయింపు: ఓసీ-01, బీసీ(బి/ఈ)-03, ఈడబ్ల్యూఎస్-01.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/కంప్యూటర్ సైన్స్)లో స్టాటిస్టిక్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్టు) -150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుసమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

జీత భత్యాలు: నెలకు రూ.37,640- రూ.1,15,500 ఇస్తారు. 

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటుూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.04.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.05.2024. (11:59)

➥ రాతపరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Notification

Online Application

Website

ALSO READ:

ఏపీ అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (Forest Range Officers) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  మే 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి...

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

Continues below advertisement