IPL 2024 PBKS vs MI Punjab Kings opt to bowl : ఐపీఎల్ (IPL) 17 సీజన్‌లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా  పంజాబ్‌(PBKS)తో ముంబయి(MI) తలపడనుంది.   కెప్టెన్ సామ్‌ కరన్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు.  భుజం గాయం కారణంగా పది రోజుల పాటు జట్టుకు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఈ మ్యాచ్‌కి కూడా దూరమయ్యాడు.  ఈ ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రెండు జట్లు.. తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌.... ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. రెండు జట్లు నాలుగేసి పాయింట్లతో సమానంగా ఉన్న ముంబై కంటే రన్‌రేట్‌ పరంగా పంజాబ్ పైన ఉంది.  గత మ్యాచులో రెండు జట్లు పరాజయం పాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. 


రికార్డులకు చేరువలో  బ్యాటర్లు 


రోహిత్‌ శర్మ మరో 28 పరుగులు చేస్తే IPLలో 6500 పరుగుల మార్క్‌ను చేరుకుంటాడు. ప్రస్తుతం 932 పరుగులతో ఉన్న లియామ్ లివింగ్‌స్టోన్ మరో 68 పరుగులు చేస్తే IPLలో 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. సూర్యకుమార్ యాదవ్ T20ల్లో 300 సిక్సర్లు చేరుకోవడానికి మరో రెండు సిక్సర్లు కావాలి. హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో 2500 పరుగులకు చేరుకోవడానికి మరో అరవై పరుగులు కావాలి. IPLలో 1000 పరుగులకు చేరుకోవడానికి తిలక్‌వర్మకు మరో తొంభై పరుగులు కావాలి. 


హెడ్-టు-హెడ్ రికార్డ్స్‌

 ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ముంబై-పంజాబ్‌ 31 సార్లు తలపడ్డాయి. ఇందులో పంజాబ్‌ 14సార్లు విజయం సాధించగా... ముంబై 16సార్లు గెలిచింది. ఒక గేమ్ టై అయింది. 

 

పిచ్ రిపోర్ట్‌

ముల్లన్‌పూర్ స్టేడియాన్ని కొత్తగా నిర్మించారు. ఇక్కడ ఇప్పటివరకూ ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ మాత్రమే జరిగింది. ఈ సీజన్ ప్రారంభంలో పంజాబ్‌-ఢిల్లీ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ స్కోరు 174. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించినా పేస్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది.

 


పంజాబ్‌ జట్టు:  సామ్ కర్రాన్ (కెప్టెన్) మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. 

 

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్ (వికెట్), అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్