Tata Curvv EV: టాటా మోటార్స్ ఇప్పుడు తన కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా కర్వ్ ఈవీ ఈ సంవత్సరం భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ కారు 2024 ఆగస్ట్‌లో లాంచ్ అవుతుందని అంచనా. కేవలం ఈవీ మాత్రమే కాకుండా టాటా కర్వ్ ఐసీఈవీ వేరియంట్ కూడా మార్కెట్లోకి రానుంది. కంపెనీ ఈ రెండు వేరియంట్‌లను కాన్సెప్ట్ రూపంలో అందించింది. టాటా కర్వ్ కంటే ముందు కంపెనీకి చెందిన అనేక ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో విడుదల అయ్యాయి. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ మార్కెట్లో ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ 2024 జనవరిలో లాంచ్ కానుంది.


టాటా కర్వ్ ఈవీ ఎక్స్‌టీరియర్
టాటా కర్వ్ ఈవీ కాన్సెప్ట్ రూపంలో లాంచ్ కానుంది. టాటా కర్వ్ ఒక కూపే ఎస్‌యూవీ. కాబట్టి ఈ కారుకు సాధారణ స్లోపింగ్ రూఫ్‌లైన్ ఇవ్వవచ్చు. ఈ టాటా కారులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను అమర్చవచ్చు. వెనుక ఎల్ఈడీ స్ట్రిప్‌తో కూడిన ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను వాహనం వెనుక భాగంలో కూడా అమర్చవచ్చు. ఈ కారులో ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్‌ను చూడవచ్చు. అంతేకాకుండా కారులో అల్లాయ్ వీల్స్ కూడా అమర్చవచ్చు.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


టాటా కర్వ్ ఈవీ ఇంజిన్
టాటా మోటార్స్ 40.5 కేడబ్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో నెక్సాన్ ఈవీని, 35 కేడబ్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో పంచ్ ఈవీని మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా నెక్సాన్ ఈవీ... ఎల్ఆర్ సింగిల్ ఛార్జింగ్‌లో 465 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని పేర్కొంది. ఈ విషయంలో టాటా కర్వ్ ఈవీ 465 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పరిధితో మార్కెట్లోకి రావచ్చని అంచనా వేయవచ్చు. ఈ కారులో పెద్ద బ్యాటరీ ప్యాక్, శక్తివంతమైన మోటారును ఉపయోగించవచ్చు. దీని కారణంగా ఈ కారు పరిధి 500 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు.


టాటా కర్వ్ ఈవీ ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడేవారు టాటా కర్వ్ ఈవీలో అనేక ఫీచర్లను పొందవచ్చు. ఈ కారులో నెక్సాన్ ఈవీ వంటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ టాటా కారులో పూర్తిగా కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కనుగొనవచ్చు. టాటా కర్వ్‌లో ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, రివర్స్ ప్యాకింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కూడా ఉండవచ్చు. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్‌తో మార్కెట్లోకి రావచ్చు. 






Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు