Lecturer Posts in AP Government Polytechnic Colleges: ఏపీ సాంకేతిక విద్యాశాఖ (SBTET AP) పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 99 లెక్చరర్ (Lecturer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ రెండు విభాగాల్లో లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
వివరాలు..
* పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 99.
జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 11 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 33 పోస్టులు, జోన్-14: 43 పోస్టులు.
విభాగాలవారీగా ఖాళీలు:
➥ ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
➥ బయోమెడికల్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
➥ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్: 12 పోస్టులు
➥ సిరామిక్ టెక్నాలజీ: 01 పోస్టు
➥ కెమిస్ట్రీ: 08 పోస్టులు
➥ సివిల్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
➥ కంప్యూటర్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 10 పోస్టులు
➥ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ ఇంగ్లిష్: 04 పోస్టులు
➥ గార్మెంట్ టెక్నాలజీ: 01 పోస్టు
➥ జియోలజీ: 01 పోస్టు
➥ మ్యాథమెటిక్స్: 04 పోస్టులు
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 06 పోస్టులు
➥ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ మైనింగ్ ఇంజినీరింగ్: 04 పోస్టులు
➥ ఫార్మసీ: 03 పోస్టులు
➥ ఫిజిక్స్: 04 పోస్టులు
➥ టెక్స్‌టైల్ టెక్నాలజీ: 03 పోస్టులు
అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీలకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా.
ALSO READ: ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్థాయి) 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2 అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్క ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒకప్రశ్నలకు 2 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
జీతం: రూ.56,100 - రూ.98,400 ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.02.2024.
➥ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేదీ: ఏప్రిల్/మే 2024.