బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7 Telugu)లో కంటెస్టెంట్స్ అయిన శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ కలిసి ‘స్పై’ అనే బ్యాచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే.. ఈ బ్యాచ్‌ను ఉన్న క్రేజే వేరు. ఇక వీరు కోరుకున్నట్టుగానే వీరిలో ఒకడైన పల్లవి ప్రశాంత్.. సీజన్ 7 విన్నర్ అయ్యి చూపించాడు. కానీ విన్నర్ అయ్యాడని సంతోషించేలోపే తన ఫ్యాన్స్ చేసిన పనివల్ల జైలులో కూర్చోవలసి వచ్చింది. ఇప్పటివరకు దీనిపై శివాజీ స్పందించకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తుండగా.. ఫైనల్‌గా దీనిపై స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు శివాజీ.


అమర్ కారు దాడిపై శివాజీ స్పందన


‘‘చాలామంది నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు. చట్టప్రకారం బయటికి వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్నాడు. తను ఎక్కడికీ పారిపోలేదు. పారిపోయాడని చెప్పి థంబ్‌నెయిల్స్ పెట్టారు చాలా బాధేసింది. ప్రశాంత్ ఎలాంటివాడో నాలుగు నెలలు ఒక హౌజ్‌లో ఉండి చూశాను. మంచి కుర్రాడు. గెలిచాను అన్న ఆనందం మనిషిని డామినేట్ చేయొచ్చు. నేను అందరినీ చూడాలి, నా వాళ్లు వచ్చారు లాంటివి ఉంటాయి. కొంచెం ఆతృత ఫీల్ అయ్యి ర్యాలీలో పాల్గొన్నాడు. స్టూడియో నుంచి బయటికి రాకముందే కొందరు కంటెస్టెంట్స్ కార్ల అద్దాలు పగిలాయి. ఆ విషయం ప్రశాంత్‌కు తెలియదు. బయట ఎవరో అభిమానులు చేశారు. చేసింది ఎవరైనా.. జరిగింది పెద్ద తప్పు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎవరి అభిమానులు అయినా కార్ల అద్దాలు పగలగొడితే.. ఏం వస్తుంది? లోపల ఫ్యామిలీ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అమర్ వాళ్ల ఫ్యామిలీ ఎంత బాధపడుంటారు. ఆ టైమ్‌లో వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండుంటారు. ఇలాంటివి చాలా తప్పు’’ అని ఫైనల్స్ రోజు జరిగిన గొడవపై స్పందించాడు శివాజీ. ఆ సంఘటనను ఖండించాడు.


జడ్జ్ నిర్ణయిస్తారు


‘‘ప్రశాంత్ గురించి పదేపదే ప్రతీసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ సంఘటన జరిగిన మొదటి గంట నుంచి ఇప్పటివరకు అసలు ఏం జరుగుతుందో ప్రతీ సమాచారం నాకు ఉంది. కాబట్టి నేను ప్రతీది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు, నాకు వాడేంటో తెలుసు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్టప్రకారమే తను బయటికి వస్తాడు. కచ్చితంగా రేపు ప్రశాంత్ బయటికి వస్తాడని ఆశిస్తున్నాం. రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే సోమవారం. ఎందుకంటే చట్టానికి లోబడిన అంశం కాబట్టి, చట్టాన్ని మనందరం గౌరవించాలి కాబట్టి.. ప్రశాంత్ బయటికి వస్తాడు. తనేం క్రిమినల్ కాదు. చట్టాన్ని అతిక్రమించాడని ఒక నెపం మోయబడ్డ వ్యక్తి. అది అతిక్రమించాడో లేదో జడ్జ్ నిర్ణయిస్తారు. తను నిర్దోషి, నిర్దోషిగానే బయటికొస్తాడు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వారి కుటుంబ సభ్యులు నాతో టచ్‌లోనే ఉన్నారు’’ అని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కు ధైర్యం చెప్పాడు శివాజీ.


అది మీ ఇష్టం


‘‘థంబ్‌నెయిల్స్ అన్నీ చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకలా పెట్టుకోవాలి? చూడాలి. చూస్తే ఎంత వస్తుంది? ఒకరిని బాధపెట్టి మన దగ్గరకు వచ్చే డబ్బుతో ఆనందం పొందాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకోవాలి. నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. మీ కుటుంబం గురించి కూడా అలాంటి థంబ్‌నెయిల్స్ పెడితే.. ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకొని కరెక్ట్ థంబ్‌నెయిల్స్ పెట్టండి. మీ ఇష్టం పెడితే పెట్టుకోండి లేకపోతే లేదు. నా అభిప్రాయం నేను చెప్పాను. ప్రశాంత్ జాగ్రత్తగా ఉన్నాడు. తను ఒక బాధితుడు. తనకోసం జరిగిన ర్యాలీలో చోటుచేసుకున్న అపశృతుల వల్ల ఇప్పుడు తను ఇబ్బందులు పడుతున్నాడు. హౌజ్‌లో నుంచి వచ్చి మూడు రోజులే అయ్యింది కాబట్టి ఇంకా అది మా మైండ్‌లో నుంచి పోలేదు. అది మీకు అర్థం కాదు. నేను తట్టుకున్నాను. కానీ ఆ వయసుకు ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి’’ అంటూ థంబ్‌నెయిల్స్‌పై స్పందించాడు.


చెప్పుకోవాల్సిన అసవరం లేదు


యావర్‌ను కలిశానని, కలిసి విషయం బయటికి చెప్పుకోవాల్సిన అసవరం లేదని తెలిపాడు శివాజీ. ఒక హౌజ్‌లోకి వెళ్లి, ఫ్రెండ్స్ అయ్యామని, అలా అని ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటారని ఆశించడం కూడా కరెక్ట్ కాదన్నాడు. ప్రశాంత్, యావర్ తనకు బిడ్డలు లాంటివారని చెప్పాడు. యూట్యుబర్స్ అందరినీ సమ్యమనం పాటించమని కోరాడు. సహకరించిన మీడియాకు, పోలీసులకు, చట్టాన్ని గౌరవించే అందరికీ ధన్యవాదాలు తెలిపాడు శివాజీ.


Also Read: రైతుబిడ్డ కోసం పాటబిడ్డ న్యాయపోరాటం - అందుకే అలా జరిగిందన్న భోలే