Group1 Results: 'గ్రూప్-1' తుది ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలను ఏపీపీఎస్సీ ఆగస్టు 17న విడుదల చేసింది.

Continues below advertisement

Group 1 Exams Results Released: ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఆగస్టు 17న సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి 11 వరకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కేవలం 11 నెలల్లోనే తుది ఎంపిక ఫలితాలను వెల్లడించడం విశేషం.  మొత్తం 110 పోస్టులకు ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

Continues below advertisement

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ జులై 14న విడుదల చేసినసంగతి తెలిసిందే. ఏపీలో మొత్తం 111 గ్రూప్‌-1 పోస్టులకుగాను 259 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్స్‌ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 3 నుంచి 10 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జనవరి 8న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాజాగా వీటి ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ జనవరి 27న విడుదల చేసింది. ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.  ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపికచేశారు. వాస్తవానికి గ్రూప్-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగింది.

ALSO READ:

తెలుగులోనూ ఏఎంవీఐ 'పేపర్-1' ప్రశ్నపత్రం, దరఖాస్తుకు మరో అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షలో జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్షల ప్రశ్నలను ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలోనూ ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. సబ్జెక్టు ప్రశ్నలు మాత్రం యథావిధిగా ఇంగ్లి్ష్‌లోనే ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు 16న అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతేడాది సెప్టెంబరు 30న ఏఎంవీఐ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్లు తెలిపింది. అయితే సరైన అర్హతలు కలిగి, అప్పుడు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆగ‌స్టు 16న ఏపీపీఎస్సీ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TSPSC: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం - ఈ తేదీల్లోనే!
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన చేసింది. పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఆగస్టు 16న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. నిర్ణీత గడువులోగా మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తులను సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వివరాలు మార్చుకునేవారు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో గ్రూప్‌-3 సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణ తొలి గ్రూప్‌-3 పరీక్షకు మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌-3 పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola