ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, ఏపీ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ఏపీ లెజిస్లేచర్ సర్వీస్ విభాగంలో తెలుగు రిపోర్టర్, ఇంక పలు విభాగాల్లో నాన్-గెజిటెడ్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
- General Studies & Mental ability
- Paper II Journalism Public Relation
- Paper III Test in Telugu and Test in English
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (సూపర్‌వైజర్) - ఏపీ వుమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్-ఆర్డినేట్ సర్వీస్
తెలుగు రిపోర్టర్స్ - ఏపీ లెజిస్లేచర్ సర్వీస్
నాన్ గెజిటెడ్ పోస్టులు
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ - ఏపీ ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబ్ సర్వీస్
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ అండ్ ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -II (వుమెన్)- ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్
ఆన్సర్ కీలపై అభ్యంతరాలకు అవకాశం..
ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఆన్సర్ కీలపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపవచ్చు. నవంబరు 11 నుంచి 13 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ అభ్యంతరాలు తెలపవచ్చు. నిర్ణీత గడువులోగా వచ్చిన అభ్యంతరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆన్‌లైన్ లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా, పోస్ట్, ఈమెయిల్, వాట్సాప్, SMS, ఫోన్ ద్వారా లేదా మరే ఇతర విధానాల్లోనూ అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం లేదు.
ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ, తెలంగాణ జీడీఎస్-2022 ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!
భారత తపాలా శాఖ- గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) నియామకాలు-2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఏడో జాబితాను పోస్టల్ శాఖ నవంబర్ 10న విడుదల చేసింది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఏపీ సర్కిల్‌లో 326 మంది అభ్యర్థులు, తెలంగాణ సర్కిల్‌లో 162 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...